హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగా ణ): తెలంగాణపై కేంద్రం వివక్ష మళ్లీ బయటపడింది. నేషనల్ హైవేల నోటిఫై, నిధుల విడుదల పై బీజేపీ ఎంపీ అర్వింద్ గురువారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి గడ్కరీ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు. గత ఐదేండ్లలో యూపీలో 3,630 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్ల ను ఎన్హెచ్లుగా, గుజరాత్లో 2,564 కి.మీ.రాష్ట్ర రోడ్లను ఎన్హెచ్లుగా నోటిఫై చేసిన కేం ద్రం.. తెలంగాణలో కేవలం 1,618 కి.మీ. రోడ్లను మాత్రమే నోటిఫై చేసింది.
కర్ణాటకలో 2,138 కి.మీ.కు చెందిన 73 అభివృద్ధి పనులకు రూ.37,112 కోట్లు ఇచ్చారు. తెలంగాణలో 1,368 కి.మీ.కు చెందిన 42 అభివృద్ధి పనులకు 18,990 కోట్లు మంజూరుచేసింది. కానీ నిధుల విడుదలలో తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నది. కర్ణాటకకు 1,272 కి.మీ. పనులకు 13,621 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. తెలంగాణలో 543 కి.మీ. పనులకు రూ.4,008 కోట్లు మాత్రమే విడుదలచేసింది.