టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ జరిపిన యత్నాలు బెడిసికొట్టాయి. సైబరాబాద్ పోలీసుల ఆపరేషన్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారితో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డితో నందకుమార్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మునుగోడు ఎన్నికల్లో గెలిచే సత్తాలేని బీజేపీ.. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే దురాలోచనతో అడ్డదార్లు ఎంచుకుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి దొరికిపోయింది. మొయినాబాద్‌కు సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో సైబరాబాద్ పోలీసులు జరిపిన దాడిలో ముగ్గురు పట్టుబడ్డారు. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ ఉన్నారు. వీరి దగ్గర నుంచి రూ.15 కోట్ల నగదును సీజ్ చేశారు.