హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): బడ్జెట్లో తెలంగాణ కు నిధుల కేటాయింపుపై కేంద్రం నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆక్షేపించారు. కొన్ని వస్తువుల కస్టమ్స్ సుంకాలను తగ్గించినప్పటికీ, సెస్‌ను పెంచి రాష్ర్టాల ఆదాయ వాటా తగ్గించిందని అభిప్రాయపడ్డా రు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వకుండా అన్యాయం చేసిందని పేర్కొన్నారు.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఏకంగా 30.5 శాతం నిధులు పెంచడం సరికాదని తెలిపారు. వరంగల్ విమానాశ్రయ అభివృద్ధికి కేటాయింపులు చేయకుండా మొండి చెయ్యి చూపిందని పేర్కొన్నారు. న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని తెలిపారు.