హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రైతు ఆత్మహత్యల నివారణకు కేంద్ర బడ్జెట్లో ఏకకాలంలో దేశవ్యాప్త రుణమాఫీకి నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే, అఖిల భారత రైతుసంఘం కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో 8 శాతం నిధులు కేటాయించి రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.