హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): 2024-25 వానకాలం సీఎమ్మాఆర్ గడువు పెంచుతూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్పూల్లో మిగిలిన బియ్యం ఇచ్చేందుకు సెప్టెంబర్ 12వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది.
వాస్తవానికి వానకాలం సీఎమ్మాఆర్ గడువు మే 31తో ముగిసింది. ఇంకా 17 లక్షల టన్నుల ధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయగా.. తాజాగా కేంద్రం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.