అయిజ, జూలై 9 : జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోని కంప్యూటర్ గది పెచ్చులూడి కంప్యూటర్ ధ్వంసమైంది. గురువారం ఈ -పంచాయతీ ఆపరేటర్ కార్యాలయంలోని గది పైకప్పు రాలి పడడంతో కంప్యూటర్, మానిటర్, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి.
విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది బయటకు రాగానే భారీ శబ్దంతో పెచ్చులూడి పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. భవనం శిథిలావస్థకు చేరిందని, మరమ్మతులు చేపట్టాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా పట్టించుకోవడం లేదని అధికారులు వాపోతున్నారు.