హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించి 16 నెలలైనా తమకు ఇంకా పారితోషికం ఇవ్వలేదంటూ ఎన్యుమరేటర్లు ఆందోళనకు దిగారు.
పెండింగ్ పారితోషికాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అర్ధగణాంకాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం సచివాలయం ఎదుట మౌనదీక్ష నిర్వహించి నిరసన తెలిపారు.