హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో(Muncipal elections) అధికార కాంగ్రెస్ పార్టీ(Congress) నాయకులు యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. అధికారం అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కాన్వాయ్‌తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హల్చల్ చేశారు. దీంతో ఎన్నికల సంఘం మంత్రిపై కేసు నమోదు చేసింది. మరోవైపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా గద్వాల(Gadwala) పట్టణంలో మంగళవారం ఉదయం నుంచి వార్డుల్లో పర్యటించారు.
అపార్ట్మెంట్లు, కాలనీల్లో మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. ఓటమి భయంతో ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు నిబంధనలు అతిక్రమించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా చోద్యం చూడకుండా చర్యలు తీసుకోవాలని గద్వాల్ పట్టణంలోని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై కేసు నమోదు
జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కాన్వాయ్‌తో హాల్చల్ చేసిన మంత్రి అడ్లూరి
దీంతో కేసు నమోదు చేసిన ఎన్నికల సంఘం pic.twitter.com/PX2Bt9qcLf
— Telugu Scribe (@TeluguScribe) February 10, 2026