Yadadri Bhongir | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పరిధిలో జైన్ కంపెనీ సమీపంలో కేపాల్ వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. TS 03 EN 6575 నంబర్ గల ఈ కారు వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కారు ఇంజిన్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన కారు యజమాని అప్రమత్తమై వాహనం ఆపి, అందులో నుంచి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కానీ మంటలు వేగంగా వ్యాపించడంతో కారు మాత్రం పూర్తిగా దగ్ధమైంది.