హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : సుప్రీం కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదావేయాలని కోరుతూ అభ్యర్థులు సీఎస్ శాంతికుమారికి శనివారం లేఖ రాశారు. వేలాదిమంది అభ్యర్థులు బాధతో ఉన్నారని, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరీక్షలను వాయిదావేయాలని లేఖలో పేర్కొన్నారు. తమ శాంతియుత నిరసనలపై పోలీసుల అకృత్యాలు పెరిగిపోయాయని వాపోయారు.