వరంగల్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మహబూబాబాద్/కేసముద్రం : ‘రేవంత్ రెడ్డీ.. జూబ్లీహిల్స్ ప్యాలెస్ ను వదిలి పంట పొలాలు, వ్యవసాయ మా ర్కెట్లలోకి రా. ఇకడ రైతుల కన్నీళ్లు, కష్టాలు మీకు అర్థమవుతయి..’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మా ర్కెట్ బాటలో భాగంగా మంగళవారం వరంగల్ ఎనుమాముల, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మారెట్లను ఆయన పరిశీలించి వడ్లు, మకలు, పత్తి అమ్మేందుకు వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ నుంచి కాంటా దాకా అన్నీ సమస్యలేనని ధ్వజమెత్తారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందవని, కరెంటు సరిగ్గా రాదని విమర్శించారు. రైతుబంధు సకాలంలో రాక, రుణమా ఫీ జరగలేదని, బోనస్ ఎగబెట్టారని మండిపడ్డారు. ఇదేనా వరంగల్ డిక్లరేషన్ అమలు అని ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. దిగుమతి సుంకాలు ఎత్తివేసి రైతులపై ఆంక్షలు పెట్టడం బీజేపీ పద్ధతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి, పామాయిల్ దిగుమతులపై సుం కం ఎత్తేసి ఎవరికి లాభం చేస్తున్నారని నిప్పు లు చెరిగారు. ఇద్దరు భాయ్‌లు రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచేందుకు కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో పత్తి రైతుల కష్టాలు తీర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మేల్కోకపోతే పత్తిని తెచ్చి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోస్తం. నీ ప్యాలస్‌ను ముట్టడిస్తం’ అని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పత్తిరైతుకు అండగా నిలవకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు.
బీజేపీ ఎంపీల కన్నా దిష్టిబొమ్మలు నయమని హరీశ్ దెప్పిపొడిచారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను తిట్టడం మినహా వారికి మరో పని చే తకాదని ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలపై కాం గ్రెస్ ఎంపీలు ప్రశ్నించరని, బీజేపీ ఎంపీ లు అసలే పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశా రు. బడాబాబులు, దళారుల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ‘రెండేండ్లలో ఏం ఉద్ధరించారని విజయోత్సవాలు చేసుకుంటున్నరు? రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టినందుకా? యూరియా బస్తాల కోసం రైతులను లైన్లో నిలబెట్టినందుకా? బోనస్ ఎగ్గొట్టినందుకా రేవంత్‌రెడ్డీ?’ అని ప్రశ్నించారు.
గత యాసంగిలో రైతులకు రావాల్సిసిన రూ. 1,100 కోట్ల బోనస్‌ను, ఈ సంవత్సరం కొనుగోలు చేసిన రూ. 1400 కోట్లను వెంటనే విడుదల చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. పంటల బీమా తెస్తామని చెప్పిన కాంగ్రెస్ రెండేండ్లయినా తేలేదని ఫైర్ అయ్యారు.
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు ఇసుక మాఫియాకు తెగబడుతున్నారని హరీశ్ విమర్శించారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు రూ. 1000 ఉన్న టన్ను ఇసుకను కాంగ్రెస్ రూ.3 వేలకు పెంచిందని ఫైర్ అయ్యారు. రేవంత్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 67వేల మంది విద్యార్థులు తగ్గిపోయారని చెప్పారు. రాష్ట్రంలో ఎకడైనా ఒక్క గుంత లేకుండా రోడ్డు ఉన్నదా? మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జవాబు చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో లంబాడాలకు మంత్రి పదవి లేదని, డిప్యూటీ స్పీకర్ పదవి లేదని హరీశ్ దుయ్యబట్టారు. ‘ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయేమోనని రేవంత్ రెడ్డికి అసెంబ్లీ పెట్టే దమ్ములేదు. డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే ధైర్యం లేదు’ అని ఎద్దేవాచేశారు. తక్షణమే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేయాలని, గిరిజనులకు, లంబాడాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. హరీశ్ వెంట శాసనమండలిలో విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయభాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, డాక్టర్ టీ. రాజయ్య, రెడ్యా నాయక్, బానోత్ శంకర్ నాయక్, పార్టీ నేతలు రాకేశ్‌రెడ్డి, చింతం సదానందం, టీ. రమేశ్‌బాబు, బీరెల్లి భరత్ కుమార్‌రెడ్డి, మార్నేని వెంకన్న పాల్గొన్నారు.
60 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రికి పత్తి రైతుల గురించి కేంద్రానికి విన్నవించే అవకాశం ఒక్కసారి కూడా దొరకలేదా? అని హరీ శ్ ప్రశ్నించారు. చోటేభాయ్..బడేభాయ్ బం ధం పత్తిరైతుకు ఎందుకు దోహదం చేయలేదని ప్రశ్నించారు. ఉపఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచిన రేవంత్‌రెడ్డి పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతున్నారని విమర్శించారు. వరదలు, తుఫాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతే రేవంత్‌రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో మరింత ఇబ్బంది పెట్టడం సరికాదని సూచించారు.
రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తిసాగవుతుందని, గతంలో ఎప్పుడూలేనివిధంగా రెండేండ్ల నుంచి రాష్ట్రంలో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని హరీశ్ వాపోయారు. సీసీఐ చర్యలు తుగ్లక్ నిర్ణయాలను తలపిస్తున్నాయని మండిపడ్డారు. కపాస్ కిసాన్యాప్, ఎల్1, ఎల్2, ఎల్3 విధానాలు ఎవరిని ఉద్ధరించేందుకని ప్రశ్నించారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12శాతానికి పెంచడంతో పత్తిరైతులు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చిందని వాపోయారు. పత్తికి రూ. 8110 ఉన్న కనీస మద్దతు ధర స్థానంలో దళారీలు ఎంత చెప్తే అంతకు అమ్ముకోవాల్సిన దురవస్థ దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం మక్కజొన్న రైతులకు కూడా న్యాయం చేయలేని దుస్థితిలో రేవంత్సర్కార్ ఉన్నదని మండిపడ్డారు. మక్కరైతులు క్వింటాకు రూ. 600 నుంచి రూ. 700 దాకా నష్టపోవాల్సి వస్తున్నదని చెప్పారు.
హరీశ్: ఏం పేరవ్వా?
ధనలక్ష్మి : నా పేరు ధనలక్ష్మి
హరీశ్: ఎవుసం ఉన్నదా?
ధనలక్ష్మి : ఉన్నది. ఐదెకరాలు
హరీశ్: మరి ఇక్కడెందుకున్నవ్?
ధనలక్ష్మి : బదలొచ్చినం. ఒగలకొగలం చేసుకుంటం.
హరీశ్ : ఏం పెట్టినవు
ధనలక్ష్మి: మేం రెండెకరాల పొలం పెట్టినం. మూడెకరాల పత్తిపెట్టినం. ఈ సారి యూరియా దొర్కలే. దిగుబడి తక్కువైంది. ఈ పత్తి పట్టుకొని మార్కట్‌కు పోతే ఖరీద్దారులు..మేం కొనం అంటాండ్లు. అగ్గువకు సగ్గువకు రూ. 4500 చొప్పున అమ్ముకున్నం. ఆ పైసలు కూళ్లకే సరిపోలే. మక్కజొన్న ఏద్దామంటే నీళ్ల సౌలత్ లేదు. కరెంట్ ఇత్తలేరు. ఓట్లేసి గెలిపిచ్చినం. ఇప్పుడు అందరం ఆగమైతున్నం.
హరీశ్: వడ్లకు బోనస్ ఇచ్చిండా?
ధనలక్ష్మి: ఏం ఇయ్యలే. మాయమాటలతోటి గెల్సిండు. ఇగ మా ఆయన పింఛన్ అయితే పాపం కేసీఆర్ కడుపు సల్లగుండ..సంతకం పెట్టిండు. ఇగ ఈనె నాలుగువేలన్నడు. పింఛన్ లేదు పాడులేదు. మా ఆయనకు పక్షవాతం వచ్చింది.