హైదరాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ): వనరుల సమీకరణ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశమైంది. సచివాలయం రెండో అంతస్తులోని భట్టి చాంబర్లో జరిగిన ఈ సమావేశంలో క్యాబినెట్ సబ్‌కమిటీ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మీడి యా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, ఐఅండ్‌పీఆర్ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వానకాలం రైతు భరోసా, ఇం దిరమ్మ గృహ నిర్మాణ పథకం, జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, ఉద్యోగుల పెం డింగ్ బిల్లుల చెల్లింపు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. మరో సభ్యుడు జూపల్లి కృష్ణారావు సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది.