నమస్తే నెట్వర్క్, ఆగస్టు 13 : పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, సాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువుల విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
విద్యార్థుల సమస్యలను పరిషరించడంలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి విద్యా శాఖ మంత్రికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో మౌలిక వసతుల కొరత ఉందని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలన్నారు. విద్యారంగానికి అవసరమైన బడ్జెట్ కేటాయించాలని పేర్కొన్నారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.