హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ వర్గీకరణ అంశంపై అన్ని షెడ్యూల్డ్ కులాల ప్రతినిధులు, కులసంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని క్యాబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ఇటీవలే సుప్రీంకోర్టు సానుకూల తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆ తీర్పులోని న్యాయపర అంశాలను అధ్యయనం చేసి, దాని అమలుకు సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ శుక్రవారం భేటీ అయి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి అన్ని సంఘాలు తమ అభిప్రాయాలనుcommr. scsub classification@gmail.comకు పంపించాలని సూచించింది.