అంతరించిపోయే దశకు చేరుకున్న కులవృత్తులు మళ్లీ జీవం పోసుకున్నాయి. కుంటుపడ్డ గ్రామీణ వ్యవస్థ గాడిన పడ్డది. బతుకే భారమనుకొన్న దుస్థితి నుంచి హుందాగా జీవించే స్థితికి చేరుకొన్నారు వృత్తికళాకారులు. నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఫ్రీ కరెంటు వచ్చింది. రజకులకు ధోబీఘాట్లు, బట్టలుతికే మిషన్లు వచ్చినయ్. కుమ్మరులకు ఆధునిక పాటరీ యంత్రాలు వచ్చినయ్, దానికి సబ్సిడీ వచ్చింది. విశ్వబ్రాహ్మణులకు ఆధునిక శిక్షణ, ఉపాధి కల్పించారు. ఇలా ఏ కులవృత్తి, ఏ కళాకారుడూ నష్టపోకుండా రాష్ట్రప్రభుత్వం కంటి రెప్పలా కాపాడుకొంటున్నది. ఫలితంగా వారికి ఏడాదంతా పనిదొరుకుతున్నది. కడుపునిండా తిండి దొరుకుతున్నది. ఇవే కాదు.. 40 కులసంఘాలకు ఆత్మగౌరవ భవనాలూ వచ్చినయ్.
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కులవృత్తులు వికసిస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కుల వృత్తుల వికాసమే కీలకమని భావించిన ప్రభుత్వం వాటి ఆధునికీకరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉచిత చేపపిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టింది. నాయీబ్రాహ్మణులు, రజకులు, కుమ్మరి/శాలివాహనులు, విశ్వబ్రాహ్మణులకు వృత్తిలో ఆధునిక నైపుణ్యాలు నేర్పించటం వల్ల ఏడాదంతా పనిదొరుకుతున్నదని ఆయా కులవృత్తిదారుల సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం తమ వారసులు కులవృత్తులను ఎంచుకోవడానికి దోహదం చేస్తున్నదని చెప్తున్నారు. వివిధ వృత్తులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఆయా కులాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయి. నాయీబ్రాహ్మణ, రజక, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ సహ అనేక వృత్తులవారు సరికొత్త పద్ధతుల్లో తమ వృత్తులను ఆధునికీకరించుకొని పురోగమిస్తున్నారు.
పాతకాలం నాటి పద్ధతులు అనుసరిస్తూ పాత్రలు చేసే కుమ్మరి/శాలివాహన వృత్తిదారులకు ప్రభుత్వం నవీన నైపుణ్యాలు నేర్పిస్తున్నది. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ 2018లో కుమ్మరి కులసంఘాల నాయకులను నాలుగు రోజులపాటు గుజరాత్ పర్యటనకు పంపి, అక్కడి పద్ధతులపై అధ్యయనం చేయించింది. భూదాన్‌పోచంపల్లిలోని రామానందతీర్థ ఇన్స్టిట్యూట్లో 350 మంది కుమ్మరి వృత్తిదారులకు వివిధ రకాల మట్టిపాత్రల తయారీలో శిక్షణ ఇప్పించారు. వీరు మరో 4వేల మందికి శిక్షణ ఇచ్చారు. వీరంతా మట్టిగణపతులు, దీపాంతలు, మట్టిగ్లాసులు, జగ్గులు, వాటర్‌బాటిల్స్ తదితర మట్టిపాత్రల తయారీలో నిష్ణాతులయ్యారు.
రజకవృత్తిదారులకు శారీరక కష్టాన్ని తగ్గించి, సాంత్వన కలిగించాలని సర్కార్ సంకల్పించింది. మొదట్లో ఒక్కొక్క దోభీఘాట్‌ను రూ.37.04 లక్షలతో నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.52.04 లక్షలకు (హైదరాబాద్‌లో రూ.65లక్షలు) పెంచింది. ఇందులో రూ.17 లక్షలు మిషనరీ (ఉతికేందుకు, పిండేందుకు, ఆరవేసేందుకు అత్యాధునిక యంత్రాలు)కి కేటాయించగా మిగిలిన మొత్తాన్ని సివిల్‌వర్క్స్(విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్, బోర్, మోటర్, శానిటేషన్, సిమెంట్ బెడ్, ఎలక్ట్రికల్, కాంపౌండ్‌వాల్)కు కేటాయిస్తున్నారు. అటు.. రజకుల లాండ్రీషాప్లు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నది. తద్వారా 2 లక్షల రజక కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నది.
కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారికి శాశ్వత ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందు కోసం అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నాం. ఆధునిక పోకడలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నాం. సబ్సిడీలతో యంత్రాలు, యంత్ర పరికరాలు అందిస్తున్నాం. కొన్ని ప్రత్యేక కులవృత్తి కళాకారులు తయారుచేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. జిల్లాలవారీగా ఫెడరేషన్ల ద్వారా కులవృత్తులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం.
-కే అలోక్‌కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ
సెలూన్ల నిర్వహణ భారంగా మారిన నేపథ్యంలో నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యు త్తు పథకం ద్వారా మా బరువును దించిన దేవుడు సీఎం కేసీఆర్. తలనీలాల విషయం లో మమ్ములను ఆదుకోవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబును కోరితే ‘మీ తోకలు కట్ చేస్తా’నని ఆయన అవమానపరిచిన రోజులు గుర్తుచేసుకొంటే బాధనిపిస్తది. గ్రామ సభల్లో కూడా మా కులాన్ని ఉచ్చరించే వాతావరణం లేని స్థితిలో ఏకంగా అసెంబ్లీలోనే మా కష్టసుఖాలను ప్రస్తావించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం.
-బాలకృష్ణ, నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు
ఆభరణాల తయారీలో తెలంగాణ విశ్వబ్రాహ్మణులది అందెవేసిన చేయి. బంగారం, వెండి తో ఎన్నో రకాల నగలను తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేసిన చరిత్ర వీరికున్నది. వృత్తికి దూరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర బీసీ ఫెడరేషన్ (విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్) ప్రత్యే క శిక్షణా కార్యక్రమాలను రెండేండ్లుగా నిర్వహిస్తున్నది. ఆభరణాల తయారీలో డై మేకింగ్, వ్యాక్సింగ్ మోల్డ్ తయారీ, స్టోనింగ్ తదితర అంశాల్లో ఆధునిక యంత్రాలతో శిక్షణనిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్ జిల్లా ల్లో వంద మందికి పైగా శిక్షణ పొందారు. తాజా గా నిజామాబాద్‌లో 30 మంది శిక్షణ పూర్తి చేసుకొన్నారు. జిల్లాల్లో ఆర్డర్లు తీసుకొని హైదరాబాద్‌లో ఆభరణాలు తయారు చేయించటం వల్ల రవాణాఖర్చుతోపాటు సమయం వృథా అ వుతున్నది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఆయా జిల్లాల్లోనే ఆధునిక పరిజ్ఞానం అందించేందుకు చర్యలు తీసుకొంటున్నది. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను పూర్తిచేసింది.
కుమ్మరి వృత్తికళాకారుల జీవన ప్రమాణాలు పెంచటంతోపాటు లబ్ధిదారుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం మోడ్రన్ పాటరీ కిన్లను సబ్సిడీపై అందిస్తున్నది. శిక్షణ పూర్తి చేసుకొన్న 320 కుమ్మరి వృత్తి కళాకారులకు ఆధునిక పాటరీ యంత్రాలను ఇటీవలే మంజూరు చేసింది. వీటి కొనుగోలుకయ్యే రూ.లక్ష ఖర్చులో రూ.80 వేలను ప్రభుత్వమే సబ్సిడీగా ఇచ్చింది.
కేశవరంలో కుమ్మరి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటుమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేశవరం గ్రామంలో కుమ్మరి వృత్తిదారుల శిక్షణ, ఉత్పత్తి కేంద్రాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్నది. కుమ్మరి ఫెడరేషన్ పరిధిలో ఉన్న 2,076 కుమ్మరి/శాలివాహన సహకార సంఘాల్లోని దాదాపు 31 వేల మంది సభ్యులకు నిరంతరం వృత్తిలో ఆధునిక నైపుణ్యాలు, యంత్రపరికరాల వినియోగం వంటి అంశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు బీసీ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నది.
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నాయీబ్రాహ్మణుల సెలూన్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నది. 2.5 లక్షల నాయీబ్రాహ్మణ కుటుంబాలకు మేలు జరుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తమకు 50 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తే జైళ్లకు పంపారని కులసంఘాల నాయకులు గుర్తుచేసుకొంటున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే ‘మీ తోకలు కట్ చేస్తా’నని చంద్రబాబు కించపరిచేవారని, కానీ సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో స్పందించి, కరెంటు సమస్యలు పరిష్కరిస్తున్నారని నాయీబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున కులసంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నది. ప్రభుత్వమే స్థలం ఇవ్వడంతోపాటు వాటి నిర్మాణానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది.
దేశ చరిత్రలో బీసీలు వారి ఆత్మగౌరవాన్ని చాటుకునేవిధంగా భవనాలు నిర్మించాలనే ఆలోచన సీఎం కేసీఆర్ మాత్రమే చేశారని ఆయా కుల సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. సమాజం కులాల సముదాయం.. వృత్తుల సమహారం. అం దులో ఏ ఒక్క కులం, వర్గం నిరాదరణకు గురైనా దాని ప్రభావం సమాజం మీద పడుతుందనే గొప్ప ఆలోచనతో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. ఆయా కులాల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా భవనాల నమూనాను ప్రభుత్వమే రూపొందిస్తున్నది.
బీసీల్లోని 40 కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి 82.30 ఎకరాల అత్యంత ఖరీదైన స్థలాన్ని సీఎం కేటాయించారు. ఈ భవనాల నిర్మాణం కోసం రూ. 95.25 కోట్లను సైతం మంజూరుచేశారు. హెచ్ఎండీఏ రూ. 10 కోట్లు ఖర్చుచేసి కుల సంఘాల వా రీగా ప్రభుత్వం కేటాయించిన విస్తీర్ణానికి అనుగుణంగా స్థలాలను గుర్తించింది. ఆయా కుల సం ఘాల ప్రతినిధులతో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సంబంధించిన భూమి పూజకు ఏర్పాట్లుచేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు సూచించారు. ఈ ఆత్మగౌరవ భవనాల్లో సమావేశ మందిరం, డైనింగ్‌హాల్, కిచెన్, గెస్ట్ రూమ్స్, దూరం నుంచి వచ్చే వారికి బస ఏర్పాట్లు వంటి వాటితోపాటు ఆయా కుల సంఘాల ప్రతినిధుల సూచనలకు అనుగుణంగా ఈ భవనాల నమూనాను రూపొందించారు.