GHMC | హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): క్యాబినెట్ సమావేశం గురువారం మధ్యాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్నది. జీహెచ్ఎంసీని ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు విస్తరించే ప్రణాళికకు క్యాబినెట్ ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. ఔటర్ లోపలి పం చాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. తెల్లరేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలకూ క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశంఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20లక్షల మందికి పైగా తెల్లకార్డుకోసం దరఖాస్తు చేసుకున్నా రు. పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పు, చేర్పులపైనా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సభలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ధరణి పోర్టల్‌లో మార్పులు, మెడికల్ సైన్స్ బిల్లు తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.
ఎగువనున్న ప్రాజెక్టుల గేట్లు తెరవడంతో శ్రీశైలం డ్యాంకు భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. బుధవారం 8 గేట్ల నుంచి నీటిని సాగర్ వైపు విడుదల చేస్తున్నారు. 3,62,411 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.