HYDRAA | పేదోడిపై సర్కారు పగబట్టింది. ఆక్రమణదారులు, కబ్జాదారులంటూ ఇండ్లను పడగొట్టింది. హైడ్రా పేరుతో ఒకవైపు.. మూసీ సుందరీకరణ పేరుతో మరోవైపు.. ఎటు చూసినా విధ్వంసమే చేసింది. రాజధాని హైదరాబాద్‌తోపాటు సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో నిరుపేదల గూడు కూల్చివేసింది. బడాబాబులకు నోటీసులిచ్చి.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపింది. ఏడాది కాంగ్రెస్ పాలనలో పెను విధ్వంసమే సృష్టించింది. కాంగ్రెస్ వ్యవహారంతో పేదల కంట కన్నీరే మిగిలింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో చిన్నపిల్లల దవాఖానను కూల్చివేస్తున్న హైడ్రా
అంబర్‌పేట సమీపంలోని తులసీరాంనగర్‌లో తన ఇంటిని కూల్చివేస్తారని రోదిస్తున్నవృద్ధురాలికి ధైర్యం చెప్తున్న కేటీఆర్
మహబూబ్‌నగర్ జిల్లా ఆదర్శనగర్‌లో ఇంటిని కూల్చివేయడంతో సామాన్లు తీస్తున్న మహిళ
శంకర్‌నగర్‌లో కూల్చివేసిన ఇంటి వద్ద రాళ్లతో ఇంటిని పేరుస్తున్న చిన్నారులు
హిమాయత్‌సాగర్ సమీపంలో మంత్రి పొంగులేటి ఫామ్‌హౌస్
సీఎం రేవంత్‌రెడ్డి బంధువు రవికాంత్‌రెడ్డి ఫామ్‌హౌస్
పట్నం మహేందర్‌రెడ్డి ఫామ్‌హౌస్
ఎమ్మెల్యే వివేక్ ఫామ్‌హౌస్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో ఇంటిని కూల్చివేయడంతో రోదిస్తూ సామాన్లను తీస్తున్న తల్లీబిడ్డలు
కూకట్పల్లి నల్లచెరువు వద్ద భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా బుల్డోజర్
మూసీ సుందరీకరణ పేరుతో చాదర్‌ఘాట్ శంకర్‌నగర్‌లో కూల్చివేసిన పేదల ఇండ్లు
శంకర్‌నగర్‌లో ఇండ్ల కూల్చివేతల అనంతరం బయటపారేసిన సామగ్రి
ఖమ్మం జిల్లాలో ఇండ్లను కూల్చేందుకు తీసుకొచ్చిన బుల్డోజర్కు అడ్డుపడుతున్న పేదలు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేపట్టారని ఇంటిని కూల్చివేయిస్తున్న అధికారులు
హైదరాబాద్ సున్నం చెరువు సమీపంలో హైడ్రా అధికారులు కూల్చివేసిన ఇంటి శిథిలాల మధ్యే ఉన్న పేదలు
శంకర్‌నగర్‌లో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న కూలీలు
చాదర్‌ఘాట్ పరిధిలోని శంకర్‌నగర్‌లో ఓ ఇంటిని కూల్చివేస్తున్న కూలీలు
హైదర్‌గూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డికి తమ గోడు వెళ్లబోసుకుంటున్న మూసీ బాధితురాలు
తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి గోడు వెళ్లబోసుకుంటున్న మూసీ బాధితులు