అధికారంలోకి వచ్చిన సందర్భంగా నేను మాటిస్తున్న! ఆరు గ్యారెంటీలతోపాటు ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనబడే ఏడో గ్యారెంటీనీ రాష్ట్రంలో అమలు చేస్తం! ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజీ పడబోము. ఇది ప్రజాపాలన!
– డిసెంబర్ 4, 2023న రేవంత్ ట్వీట్
అసెంబ్లీ సభ్యులను అసెంబ్లీలోకే రానీయని దారుణం. ఎమ్మెల్యేల మీద పోలీసుల దౌర్జన్యం.. మహిళా శాసనసభ్యుల చీరలు లాగి.. గొంతులు పిసికి.. చట్టసభ సభ్యుల ప్యాంట్లు, అంగీలు చింపి.. తోసేసి..! ఎవరిచ్చారీ అధికారం? ఎవరిచ్చారా ఆదేశం? చట్టాలను రచించే దేవాలయం లాంటి గౌరవసభ ముందు ఈ క్షుద్రతాండవమేమిటి?
1,082 రోజుల పాటు సాగిన భారత రాజ్యాంగ నిర్మాణ సభ; భవిష్యత్తులో ఒక చట్టసభ ప్రాంగణంలో ఇలాంటి ఘాతుకం చోటు చేసుకుంటుందని ఊహించి ఉండదు. ఉంటే దీనికి కారకులను జైల్లో పెట్టుమని చెప్పి ఉండేది. ఈ దారుణాన్ని ఉన్నత న్యాయస్థానం తూర్పారబట్టడం, పోలీసులపై చర్యకు ఆదేశించడం ఒకటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా ఉందన్న నమ్మకం కలిగించే అంశం.
రాహుల్‌గాంధీ పార్లమెంటుకు నల్లచొక్కా వేసుకొచ్చినప్పుడు.. నిండు సభలో ప్లకార్డులు ప్రదర్శించినప్పుడు.. న్యాయ్‌యాత్ర అంటూ నీతులు వల్లించినప్పుడు.. చప్పట్లు కొట్టిన అదే కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణలో తన లోలోన దాగి ఉన్న నియంతను బయటకు చూపిస్తున్నది. పాలన చేతగాక.. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్నీ, ప్రజలపక్షాన్నీ టార్గెట్ చేస్తున్నది. వెయ్యి అడుగుల గొయ్యి తీసి.. ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తున్నది. ఇదీ తెలంగాణలో సాగుతున్న ‘ప్రజాపాలన’! వెయ్యిరోజులు పూర్తిచేసుకున్న అరాచక పాలన!
పెరుగుతున్న జనాగ్రహ సెగ.. విపక్షం సభలో ఉంటే వెయ్యిరోజుల పాలనపై లక్ష ఉతుకుల చాకిరేవు తప్పదన్న దడ. అందుకే నల్లచొక్కాల సాకు చూపి, పోలీసు చర్యకు దిగింది. ఇదే పని కాంగ్రెస్ యువరాజు పార్లమెంట్లో చేస్తే లేని తప్పు.. బీఆర్ఎస్ అసెంబ్లీలో చేస్తే ఎలా తప్పయ్యింది? ఢిల్లీలో ఉడికిన ‘పప్పు’లు అసెంబ్లీలో ఎందుకు ఉడకవు? అధికారసౌధాల్లో ఉన్నవారు.. గతంలో చేపట్టిన నిరసనల మాటేమిటి? అప్పుడు విలువలు మాట్లాడి.. ఇప్పుడు వలువలు లాగుతరా?
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) : తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోనే ప్రజాప్రతినిధుల హకులు ఖాకీ బూట్ల కింద నలిగిపోయిన దారుణ దృశ్యాలు యావత్ రాష్ర్టాన్ని నిర్ఘాంతపరిచాయి. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో, చట్టసభల ముంగిట ప్రభుత్వ బలగాల కరశత్వం హద్దులు దాటింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ శాసనసభ్యులపై రేవంత్‌రెడ్డి సాయుధ దళాలు సామూహికంగా భౌతిక దాడికి దిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చీర పట్టుకొని విచక్షణారహితంగా లాగిన తీరు.. బూటు కాళ్లతో తొకుతూ నెట్టివేయడం. మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని మగ పోలీసులు జుటు ్టపట్టుకొని గుంజేయడం, ఆమె గొంతు పిసికే ప్రయత్నం చేయడం, కేటీఆర్ మీద పడి రక్కిన తీరు, హరీశ్‌రావును రోడ్డు మీద పడేసి తొక్కిన రాక్షస ప్రవర్తన.. ఇలా ప్రతి దృశ్యం ప్రశ్నించే గొంతుకలను భౌతిక దాడులు, నిర్బంధాలతో మూయించవచ్చనే రేవంత్‌రెడ్డి ఫ్యూడల్ ఆలోచనకు అద్దం పట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమల్లో వైఫల్యాలను ఎండగడుతూ ‘హామీల అమలులో కాంగ్రెస్ వైఫ ల్యం.. వెయ్యి రోజులపాలన నిష్ఫలం’ అని రాసి ఉన్న నల్ల టీషర్టులను ధరించి శాంతియుతంగా అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలను రేవంత్‌రెడ్డి ఉసిగొల్పిన వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా నల్ల టీషర్టుల మీద అభ్యంతరకర రాతలు ఉన్నాయని డీసీపీ శిల్పవల్లి ఆక్షేపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల టీ షర్టులను విప్పించారు. అసెంబ్లీలోకి వెళ్లే హకు తమకు లేదా? అంటూ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్న తరుణంలో సహనం కోల్పోయిన పోలీసులు బలప్రయోగానికి దిగడంతో హింసాత్మక రూపం దాల్చింది. గౌరవ ఎమ్మెల్యేలను చట్టసభల ప్రాంగణం ముందే రోడ్లపై ఈడ్చి పారేయడం, దుస్తులు లాగి, చొక్కాలు చింపి, మెడలు పట్టి తోసేయడం వంటి అత్యంత హేయమైన చర్యలు తెలంగాణ రాజకీయ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా నిలిచాయి.

ముందుగా కేటీఆర్, ఆయన వెంటనే హరీశ్‌రావు.. వారి వెనుకే ఒకరి వెంట ఒకరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా గన్పార్ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. గుండెల్లో అమరుల స్మరణ, ఒంటి మీద నల్ల రంగు టీషర్టులు ధరించారు. ‘హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం.. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం’ అని టీషర్టుల మీద రాసి ఉన్నది. అంతా కలిసి అమరులకు ప్రణమిల్లారు. నినదించి జోహార్లు అర్పించారు. స్తూపం వద్దనే ప్రజాగళాన్ని వినిపిస్తూ కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి ప్రభు త్వ తీరుపై గర్జించారు.
అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి పాదయాత్రగా కదిలారు. అప్పటికే అకడ వేల మంది పోలీసులు చుట్టుముట్టారు. గేటు నంబర్ 3 వద్ద ప్రజాప్రతినిధులను అడ్డగించారు. ‘నల్ల దుస్తులతో లోపలికి అనుమతి లేదు. స్పీకర్ ఆర్డర్ ఉన్నది. సరార్ ఆదేశాలున్నాయి’ అంటూ గేటు ముందే అడ్డుగోడలా నిలబడ్డారు. శాంతియుతంగా అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు యత్నించిన నేతలను గేట్ల ముందే అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అప్పటిదాకా నిశ్శబ్దంగా సాగిన పాదయాత్ర, పోలీసుల అడ్డగింతతో ఒకసారిగా రణరంగంగా మారిపోయింది.
మరోవైపు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రంగంలోకి దిగిన క్షణాలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. నల్లటీషర్టు ధరించి హూందాగా సభలోకి వెళ్తున్న కేటీఆర్‌ను వందల మంది పోలీసులు చుట్టుముట్టారు. ఆయన్ను చేతులతో రక్కారు. గోర్లతో గీరారు. కేటీఆర్‌ను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అతిచేసిన తీరు వీడియోల్లో రికార్డయింది. పోలీసుల దౌర్జన్యాన్ని, నిబంధనల ఉల్లంఘనను కేటీఆర్ అత్యంత కటువుగా, నిర్భయంగా నిలదీశారు. తన చేతులు, మెడపై పడిన గీరుడు గాయాలను స్వయంగా మీడియా కెమెరాల ముందు చూపిస్తూ, ఉన్నతాధికారుల ముఖం ముం దే ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇట్లా కొడుతారా మమ్మ ల్ని? ఇట్లా రకేస్తారా? ఇట్లా గీరేస్తారా మమ్మల్ని? మా ఒంటి మీద గీతలు చూడండి.. ఇదా మీ ప్రజాపాలన?’ అంటూ నిప్పులు చెరిగారు. స్పీకర్ నుంచి లిఖితపూర్వకమైన ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? అని పోలీసు అధికారులను నిలదీశారు.

డీసీపీ గారూ.. నిజంగా స్పీకర్ ఏమైనా రూల్ పాస్ చేశారా? ఉంటే లిఖితపూర్వక ఆర్డర్ చూపించండి.. మేమే తప్పుకొంటాం. కానీ మౌఖికంగా ఎవరో చెప్పారని శాసనసభ్యులను అడ్డుకొనే అధికారం మీకెకడిది? గుర్తుపెట్టుకోండి.. మరో రెండేండ్లలో మా ప్రభుత్వం వస్తుంది.. అప్పటికి మీ బ్యాడ్జ్‌లు ఉంటాయా? సర్వీసులో ఉంటారా? డ్యూటీ చేయండి కానీ ఇంత అతి చేయకండి.. ఇది మంచి పద్ధతి కాదు’ అంటూ నిప్పులుచెరిగారు. ఓవైపు కేటీఆర్ మాట్లాడుతుండగానే వెనుక నుంచి పోలీసులు దురుసుగా వస్తూ ఆయన్ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి.
ముఖ్యంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర కలకలం రేపింది. రోడ్డు మీదనే పోలీసులు హరీశ్‌రావును చుట్టుముట్టారు. ఆయన్ను బలవంతంగా అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. హరీశ్‌రావు మీద బలప్రయోగం చేయడంతోనే ఆయన రోడ్డు మీద పడిపోయారు. అప్పటికీ పోలీసుల అత్యుత్సాహం ఆగలేదు. బలవంతంగా ఈడ్చివేసే బలప్రయోగానికి దిగడంతో సహచర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. నల్ల టీషర్టు అభ్యంతరం అని పోలీసులు అడ్డుచెప్పడంతో ఆయన తన టీ షర్టును తొలగించి, ఇప్పుడైనా అసెంబ్లీకి వెళ్లనివ్వాలని పోలీసులను అడుగుతున్న దృ శ్యాలు ప్రసార మాధ్యమాల్లో రాష్ట్ర ప్రజానీకం చూసింది.

అయినా పోలీసులు అంగీకరించకపోవడంతో ఆయన బనియన్‌తోనే రోడ్డుపై ఉండాల్సి వచ్చింది. అదే స్థితిలోనే మీడియా ముందుకు వచ్చి న హరీశ్‌రావు గొంతు ఆగ్రహం, ఆవేదనతో ప్రతిధ్వనించింది. ‘సభకు రానివ్వకపోతే అసెంబ్లీకి ఎందుకు పిలిచారు? ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడుపుతారా?ఇదేనా ప్రజాపాలన? రేవంత్‌రెడ్డీ.. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు రాజ్యం ఏలుతావు? ఎంతకాలం ఈ దౌర్జన్యం చేస్తావు?’ అంటూ ఆయన రేవంత్ సర్కార్‌ను నిలదీశారు. పోలీసు బలగాలు ఆయన్ను చుట్టుముట్టి చేతులు గట్టిగా పట్టుకొని లాకెళ్తుండగా, హరీశ్‌రావు ప్రతిఘటిస్తూనే అక్రమ అరెస్టులను నిలదీశారు. తనను అసెంబ్లీ లోపలికి ఎందుకు అనుమతించడం లేదో లిఖితపూర్వకంగా చెప్పాలని డీసీపీ, ఉన్నతాధికారులను ప్రశ్నిస్తుండగానే పోలీసులు బలవంతంగా ఆయన్ను వాహనంలోకి ఎకించేందుకు ఉత్సాహం చూపారు.
అసెంబ్లీ గేటు నంబర్ ఒకటి వద్ద, చుట్టుపకల రోడ్లపై పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. మీడియా కెమెరాలు, ఫొటోగ్రాఫర్లు, పార్టీ కార్యకర్తలు, ఖాకీల మధ్య తోపులాటలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తోపాటు డాక్టర్ సంజయ్, సుధీర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు కాళ్లతో తన్నుతూ, చేతులతో పకకు విసురుతూ తీ వ్రంగా గాయపరిచారు. జగదీశ్‌రెడ్డి వంటి సీనియర్ నేతలను బందోబస్తు వాహనాల్లోకి కుకేందుకు ఖాకీలు ప్రదర్శించిన అత్యుత్సాహం భీతావహంగా కనిపించింది.
పోలీసు వాహనం డోర్లు తెరిచి నేతలను లోపలికి నెట్టుతుండగా, కాళ్లు, చేతులు గేట్లలో ఇరుకుపోయినా లెకచేయకుండా డోర్లు వేయడానికి పోలీసులు ప్రయత్నించడం, ఆ క్రమంలో నేత లు కేకలు వేయడం స్పష్టంగా వినిపించింది. ఎమ్మె ల్సీ తాతా మధును కింద పడేసి పిడిగుద్దులు గుద్దా రు. ఆయన మర్మావయవాలను గాయపరిచేందుకు పోలీసులు చేసిన జుగుప్సాకరమైన పనికి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకున్నది. జగదీశ్‌రెడ్డి, కేటీఆర్ సహా పలువురు నాయకుల శరీరాలపై రక్తపు చారికలు, గీరుడు గాయాలు కనపడటం అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘర్షణ తీవ్రతకు అద్దంపట్టిం ది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆయనను పోలీసులు తెలంగాణ భవన్‌కు తరలించగా అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలు నిమ్స్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించారు.
పోలీసుల దురుసు ప్రవర్తన అకడితో ఆగలేదు. నేరుగా సబితాఇంద్రారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఒక మహిళా మాజీ హోంమంత్రి అని కూడా చూడకుండా, పోలీసు బలగాలు గుంపుగా ఆమెను చుట్టుముట్టాయి. ఆ తోపులాటలో ఒక మగ పోలీసు అధికారి ఏకంగా సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని వెనకి బలంగా నెట్టివేసిన దృశ్యాలు అత్యంత దిగ్భ్రాంతిని కలిగించాయి. ఈ దాడిలో దాదాపు 30 సెకన్లపాటు ఆమె నొప్పితో విలవిలలాడటం స్పష్టంగా కనిపించింది. ‘అమ్మా..’ అంటూ బాధ, ఆక్రోశంతో ఆమె అరిచిన అరుపులు రణరంగంలో పోలీసుల కరశత్వాన్ని స్పష్టంగా కండ్లకుగట్టాయి. తోటి నేతలు, కార్యకర్తలు ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా, పోలీసులు ఏ మాత్రం కనికరం లేకుండా గొంతు పిసికే ప్రయత్నం చేస్తూ, మెడ వద్ద చేతులు వేసి నెట్టివేస్తూ హింసాత్మక వాతావరణాన్ని సృష్టించారు.
ఈ ఘటనలోనే అత్యంత దారుణమైన, భావోద్వేగపూరితమైన దృశ్యాలు మహిళా శాసనసభ్యులను పోలీసులు ట్రీట్ చేసిన తీరులో వెలుగుచూశాయి. మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మానవత్వాన్ని సైతం సిగ్గుపడేలా చేసిం ది. తోపులాటల మధ్య నిరసన తెలుపుతున్న క్రమంలో మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు ఆమె చీరను గట్టిగా పట్టి లాగడం, ఆమెపై ఒత్తిడి తేవడం వీడియోల్లో స్పష్టంగా రికార్డయింది.
పోలీసుల తోపుడుకు ఆమె కిందపడబోగా పక్కనే ఉన్న ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి పట్టుకున్నారు. లేకుంటే ఆమె పోలీసులు ఏర్పాటు చేసిన ముండ్ల కంచె మీద పడిపోయేవారు. ఒంటిపై చీర చెదిరిపోవడం, బూట్ల కింద పాదాలు తొక్కడంతో తీవ్ర అవమానభారంతో సునీతా లక్ష్మారెడ్డి రోడ్డుపైనే బోరున విలపించారు. తన ముఖాన్ని చీర కొంగుతో దాచుకుంటూ ఆమె వెకివెకి ఏడ్చిన దృశ్యాలు గుండెల్ని పిండేశాయి. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమెను హత్తుకొని ఓదారుస్తూనే, పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా బూట్లతో మా కాళ్లు తొకేస్తరా? చీరలు పట్టి లాగుతారా? ఇదేం పద్ధతి? అసెంబ్లీలో నల్ల బట్టలు వేసుకున్నారని సస్పెండ్ చేశామన్నా రు.. మరి మేము సాధారణ దుస్తులతో లోపలికి వెళ్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? అసెం బ్లీ గేట్లలోకి కూడా పోనివ్వరా? స్పీకర్ ఆర్డర్ ఉన్నదా?’ అంటూ పోలీసులను నిలదీశారు.
అసెంబ్లీ వద్ద ఘటనలో అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. జగదీశ్‌రెడ్డికి బీపీ 185కిపైగా నమోదైనట్టు వైద్యులు పేరొన్నారు. ఆయన్ను పరామర్శించిన వారిలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులున్నారు