BRSV | హైదరాబాద్ : పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్ భవన్ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు. ధర్నాకు దిగిన అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు పడాల సతీష్, కడారి స్వామి యాదవ్‌తో పాటు బీఆర్ఎస్వీ శ్రేణులను, విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సు పాస్ ఛార్జీలు పెంచడం వల్ల పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది. ఒక్కో విద్యార్థిపై రూ. 250 నుంచి రూ. 350 వరకు భారం పడుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థులపై ఈ విధమైన భారం ఏదీ విధించలేదు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి, ఒకవైపు బస్సులను పెంచక విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ.. మరోవైపు చార్జీలు పెంచి విద్యార్థులపై రేవంత్ సర్కార్ ఆర్ధిక భారాన్ని మోపుతుందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. పెంచిన బస్సు చార్జీలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బస్ భవన్ ఎదుట మెరుపు ధర్నా చేపట్టిన బీఆర్ఎస్వీ శ్రేణులు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు @GelluSrinuBRS సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం… pic.twitter.com/RhJNHynYa5
— BRS Party (@BRSparty) June 10, 2025