BRSV | జియాగూడ, మార్చి 27 : రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయాన్ని ముట్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ధర్నా నిర్వహించారు.
సీమాంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలతో కుమ్మక్కై పదోతరగతి ప్రశ్నపత్రాలను రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నప్పటికీ పరీక్షలకు ముందు సమీక్షించకుండా, పరీక్షలు నిర్వహించడం వల్లే నకిరేకల్, మంచిర్యాల, వికారాబాద్, జుక్కల్‌లో పేపర్ లీకు జరిగిందని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ బాధ్యుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ భాధ్యులను వేంటనే ఆరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు పరీక్షలు నిర్వహిస్తే నాలుగు ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం చూస్తుంటే విద్యాశాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలతో కుమ్మక్కై కాంగ్రెస్ ఎమ్మెల్యేలే లీకులకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించమని కోరితే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కేటీఆర్‌పై నకిరేకల్‌లో అక్రమ కేసు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి పేషి నుండి ఆర్డర్ రాగానే సెకండ్లలో కేసులు నమోదు చేస్తున్నారు.. కానీ పేపర్ లీకేజీ కేసులో అసలు నిందితులను తప్పించారని ఆయన అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు మానుకోవాలని పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటే మంచిదన్నారు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మేము న్యాయ పరంగా కొట్లాడుతామన్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి కానీ మేము అధికారంలోకి వచ్చాక అన్ని తేల్చుతామన్నారు. బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు విధ్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఆరెస్ట్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, చటారి దశరథ్, కాటం శివ, నర్సింగ్,శ్రీను నాయక్, మిద్దె సురేష్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్ రావు, కల్వ నితీష్, సాయి గౌడ్, రాకేష్, రెహమాత్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.