BRSV | తెలంగాణలో పెండింగ్లో ఉన్న సుమారు రూ. 12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి ప్రకటించిన 1000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నిరసన ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అక్టోబర్ 29న నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామని చెప్పిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని గుర్తు చేశారు.
ఉద్యోగ నియామకాల్లో తీవ్ర జాప్యం..
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డీఎస్సీ, పోలీస్, వైద్యారోగ్య శాఖ తదితర నియామకాలను వేగవంతం చేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని తుంగ బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో తీవ్ర జాప్యం, పరీక్షల నిర్వహణలో స్పష్టత లేకపోవడం, తరచూ షెడ్యూళ్లలో మార్పులు, ఖాళీల భర్తీలో నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారని పేర్కొన్నారు.
ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న అభ్యర్థులను ప్రభుత్వం నిరాశకు గురిచేస్తోందని తుంగ బాలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కొంపల్లి నరేష్, చాప భాస్కర్, కొమ్మనబోయిన సైదులు యాదవ్, అద్వైత్, వల్లమల్ల సూర్యప్రకాష్, కొండ గణేష్, ప్రసన్న కుమార్, సురేష్, రవికిరణ్, నిరంజన్, ప్రభాకర్, నితీష్ కుమార్, మహేష్, పరశురాం, సాయి కిరణ్, శాంతి కుమార్, రమేష్, శివ ప్రసాద్, కరుణాకర్, ముకేశ్, వినయ్, సాయి, నవీన్, మహేష్, సాయి చరణ్, శౌర్య మనోజ్, మహేందర్, మహిపాల్, కుమార్, శ్రీశైలం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
🔹 ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి ప్రకటించిన 1000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నిరసన ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు @thungabaluBRS
🔹 బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అక్టోబర్ 29న నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
🔹 పోస్టర్ ఆవిష్కరణ అనంతరం తుంగ బాలు మాట్లాడుతూ.. 👇🏻
తెలంగాణలో పెండింగ్లో ఉన్న సుమారు రూ. 12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి, మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించింది
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామని చెప్పిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని గుర్తు చేశారు.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డీఎస్సీ, పోలీస్, వైద్యారోగ్య శాఖ తదితర నియామకాలను వేగవంతం చేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగ నియామకాల్లో తీవ్ర జాప్యం, పరీక్షల నిర్వహణలో స్పష్టత లేకపోవడం, తరచూ షెడ్యూళ్లలో మార్పులు, ఖాళీల భర్తీలో నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారని పేర్కొన్నారు.
ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న అభ్యర్థులను ప్రభుత్వం నిరాశకు గురిచేస్తోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కొంపల్లి నరేష్, చాప భాస్కర్, కొమ్మనబోయిన సైదులు యాదవ్, అద్వైత్, వల్లమల్ల సూర్యప్రకాష్, కొండ గణేష్, ప్రసన్న కుమార్, సురేష్, రవికిరణ్, నిరంజన్, ప్రభాకర్, నితీష్ కుమార్, మహేష్, పరశురాం, సాయి కిరణ్, శాంతి కుమార్, రమేష్, శివ ప్రసాద్, కరుణాకర్, ముకేశ్, వినయ్, సాయి, నవీన్, మహేష్, సాయి చరణ్, శౌర్య మనోజ్, మహేందర్, మహిపాల్, కుమార్, శ్రీశైలం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
— BRS Party (@BRSparty) October 5, 2026