NEET Paper Leak | నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ సర్కార్ అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనకు నిరసనగా హైదరాబాద్‌లోని లోక్ భవన్ వద్ద బీఆర్ఎస్వీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పరీక్ష నిర్వహణలో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (NTA) ఘోరంగా విఫలమైందని అన్నారు. పగలు రాత్రి కష్టపడి చదివిన విద్యార్థులకు మోదీ ప్రభుత్వం ఇచ్చే బహుమతి పేపర్ లీకేజీలా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పుడు పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని అన్నారు. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కి, వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడానికే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం లేదని మండిపడ్డారు. నైతిక బాధ్యత వహిస్తూ NTA డైరెక్టర్ జనరల్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాని డిమాండ్ చేశారు.
విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సిగ్గుచేటు అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. లీకు వీరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అకడమిక్ క్యాలెండర్ దెబ్బతినకుండా వెంటనే పకడ్బందీగా పరీక్షా తేదీలను ప్రకటించాలన్నారు.
నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీకి మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ, నీట్ పరీక్ష రద్దుకు నిరసనగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు @GelluSrinuBRS ఆధ్వర్యంలో లోక్ భవన్ వద్ద బీఆర్ఎస్వీ నాయకుల భారీ ధర్నా
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ:
🔸 నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ… pic.twitter.com/f6ntt1ifAe
— BRS Party (@BRSparty) May 13, 2026