చిన్నకోడూరు, మే 3: ‘రేవంత్‌రెడ్డి.. ఎంతమంది రైతుల ఉసురు పోసుకుంటవ్? ఇంకెంతమంది రోడ్ల మీదికి రావాలి? వడదెబ్బ తగి లి కుప్పల మీదనే రాలిపోయే పరిస్థితి రైతులకు రావడం బాధాకరం.రేవంత్‌రెడ్డికి రైతుల పై కనీసం కనికరం లేదు. నువ్వు ఒరిజినల్ రై తు బిడ్డవి కాదు.. డూప్లికేట్ రైతు బిడ్డవు’ అని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చి న్నకోడూరు మండలం మల్లారం రాజీవ్ ర హదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని రైతు లు చేస్తున్న రాస్తారోకోకు హరీశ్‌రావు మద్దతు తెలిపి వారితోపాటు బైఠాయించారు. రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాజీవ్ రహదారిపై కి లోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయా యి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో సర్కార్ పూర్తి విఫలమైందని ఆరోపించారు. వడ్లు కొనద్దనే ఉద్దేశంతో రకరకాల ఇబ్బందులతో రైతులను గోసపుచ్చుకుంటుందని మం డిపడ్డారు. పేరుకు మాత్రం కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించారు తప్ప ఒక గింజ కూ డా కొనుగోలు చేయడం లేదని విమర్శించా రు. మల్లారంలో ఓ ఫంక్షన్‌కు వస్తే ఇక్కడ రై తులంతా రాస్తారోకో చేస్తున్నారని, ఎందుకని ఆరా తీస్తే కేంద్రంలో వడ్లు పోసి 28 రోజులు అవుతుందని, కొనేటోళ్లు లేరని ఆవేదన చెం దుతున్నారని తెలిపారు. రైతుల రాస్తారోకో వి షయం కలెక్టర్‌కు ఫోన్ చేసి చెప్తే రూల్స్ మా ట్లాడటం సరికాదని అన్నారు. గ్రేడ్ల పేరిట, తా లు ఉన్నదని, కోతల పేరిట రకరకాలుగా ఇ బ్బందులు గురిచేయడం దారుణమని అన్నా రు.
మకజొన్న రైతులకు నాలుగు రోజులుగా గన్నీ బ్యాగులు లేవని, బ్యాగులు రైతులే కొనుకొవాలని చెప్పడం దారుణమని అన్నారు. చి న్నకోడూరు, సిద్దిపేటలో కొనుగోళ్లు ఆగిపోయాయని తెలిపారు. ‘ధాన్యం కొంటరా… కొ నరా.. కొంటె ఎప్పటినుంచి కొంటరు?’ అని చెప్పేవారే కరువయ్యారని అన్నారు. 22 రోజులుగా రైతులు పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్న, మక్కలు కొనుగోలు చేయకపోవడం తో ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సం గారెడ్డి జిల్లాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. 90 లక్ష ల టన్నుల వడ్లు కొంటామని సచివాలయంలో చెప్పిన ప్రభు త్వం ఇప్పటివరకు 9 లక్షల టన్నుల వడ్లు కొనలేదని.. ఇప్పటివరకు 10 పైసల వడ్లు కొ నలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నద ని హరీశ్‌రావు మండిపడ్డారు. ఉన్నతాధికారులను ప్రతి జిల్లాకు ఒకరిని నియమించి ధాన్యం కొనుగోలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.