హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): బీజేపీని రక్షించేందుకే కాం గ్రెస్ పనిచేస్తున్నదని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరోసా రి రుజువు చేశాయని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. రాహుల్‌గాంధీ రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు బీజేపీ గెలుస్తూనే ఉంటుందని ఎద్దేవాచేశారు.
ఢిల్లీలో బీజేపీ గెలుపు కోసం శ్రమించిన కాంగ్రెస్ పార్టీకి మోదీ ధన్యవాదాలు తెలుపాలని సూచించారు. తెలంగాణ ప్రజలను రాహుల్‌గాంధీ కుటుంబం మోసం చేసింద ని, ఎన్నికలప్పుడు రాష్ట్రానికి వచ్చి.. హామీలు ఇ చ్చారని, ఇప్పుడు వాటిని గాలికొదిలేసి మోసం చే శారని మండిపడ్డారు. గ్యారెంటీల అమలు వైఫ ల్యం.. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమికి కారణమని స్పష్టంచేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు రాహుల్‌గాంధీ కుటుంబం క్షమాపణలు చెప్పి ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చాలని డిమాండ్‌చేశారు.