KTR : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. హైడ్రా ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నిర్మాణాలకు బ్రేక్ పడిందని, ఎక్కడి ఫైళ్లు అక్కడే నిలిచిపోయాయని ఓ పత్రికలో వచ్చిన వార్తను ట్యాగ్ చేస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో కేటీఆర్ ఒక పోస్టు పెట్టారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలని, లేదంటే మన చిట్టి (రేవంత్‌రెడ్డి) పదవి మటాష్ అవుతుందని కేటీఆర్ తన పోస్టులో ఎద్దేవా చేశారు.
ఇది మనమే ఏరికోరి తెచ్చుకున్న మార్పు కదా అని పేర్కొన్నారు. చివరలో ఆంగ్లంలో కాంగ్రెస్ లూట్స్ తెలంగాణ (#CongressLootsTelangana) అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేశారు. ”RR Tax” కట్టాలి కదా ? ఢిల్లీ కి మన చిట్టి కప్పం కట్టకపోతే పదవి మటాష్ కదా !! మనమే ఏరికోరి తెచ్చుకున్న మార్పు కదా” అని కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
“RR Tax” కట్టాలి కదా ?
ఢిల్లీ కి మన చిట్టి కప్పం కట్టకపోతే పదవి మటాష్ కదా !!
మనమే ఏరికోరి తెచ్చుకున్న మార్పు కదా #CongressLootsTelangana pic.twitter.com/AXgQLtpMaD
— KTR (@KTRBRS) October 19, 2024