KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ప్రజలతో మమేకమవుతూ.. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకై పోరాడుతున్నారు.
శుక్రవారం రాత్రి సిరిసిల్ల (Sirisilla) పట్టణంలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ గల్లీలో షటిల్ ఆడుతున్న పిల్లలతో సరదాగా ముచ్చటించారు. నెట్ లేకుండా షటిల్ ఎలా ఆడుతున్నారంటూ కాసేపు చిన్నారులను సరదాగా ఆటపట్టించారు. అనంతరం వారితో షటిల్ ఆడి సందడి చేశారు (played shuttle). కేటీఆర్‌ను చూసిన ఇరుగుపొరుగు వారు ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. చిన్నారులతో కేటీఆర్ షటిల్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సిరిసిల్ల పట్టణంలో నిన్న రాత్రి షటిల్ ఆడుతున్న పిల్లలతో ముచ్చటించి.. కాసేపు షటిల్ ఆడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. pic.twitter.com/APZxv75Nx3
— Telugu Scribe (@TeluguScribe) April 6, 2024
Also Read..
Gold Price | హైదరాబాద్‌లో జీవితకాల గరిష్ఠానికి బంగారం ధరలు.. తులం రూ.71 వేలకు పైనే
NIA Team | ఎన్ఐఏ బృందంపై దాడి.. ఇద్దరు అధికారులకు గాయాలు..!
Rishi Sunak | ఇంగ్లండ్ జట్టుతో కలిసి క్రికెట్ ఆడిన రిషి సునాక్.. VIDEO