Gold Price | హైదరాబాద్లో జీవితకాల గరిష్ఠానికి బంగారం ధరలు.. తులం రూ.71 వేలకు పైనే
Gold Price | దేశంలో బంగారం ధరలు (Gold Price) ఆకాశాన్నంటుతున్నాయి. పసిడి ధరలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో దూసుకుపోతూ జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి.
Gold Price | దేశంలో బంగారం ధరలు (Gold Price) ఆకాశాన్నంటుతున్నాయి. పసిడి ధరలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో దూసుకుపోతూ జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.71 వేలకు పైనే పలుకుతోంది. శనివారం నాడు హైదరాబాద్లో 99.9 స్వచ్ఛత (24 క్యారెట్) కలిగిన 10 గ్రాముల పసిడి విలువ మునుపెన్నడూ లేనివిధంగా ఏకంగా రూ.71,290గా నమోదైంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,350గా ఉంది. పెండ్లిళ్ల సీజన్ కావడం, అంతర్జాతీయ మార్కెట్ నుంచి అనుకూల సంకేతాలు వస్తుండటంతో దేశీయ మార్కెట్లో ధరలు రోజుకింత పెరుగుతూపోతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.71,440 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.65,500గా ఉంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,290 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,350గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.71,290 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,350గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,160 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 పలుకుతోంది.
ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.82,000కుపైనే పలుకుతోంది. హైదరాబాద్లో కిలో వెండి రూ.84,900గా ఉంది. ఢిల్లీలో 83,500, ముంబైలో 83,500, చెన్నైలో 87,000, బెంగుళూరులో 82,000 వద్ద వెండి ధరలు కొనసాగుతున్నాయి.
Also Read..
Hardik Pandya | సోమనాథ్ ఆయంలో హార్దిక్ పాండ్యా పూజలు.. VIDEO
NIA Team | ఎన్ఐఏ బృందంపై దాడి.. ఇద్దరు అధికారులకు గాయాలు..!
Rishi Sunak | ఇంగ్లండ్ జట్టుతో కలిసి క్రికెట్ ఆడిన రిషి సునాక్.. VIDEO
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

