Hardik Pandya | సోమనాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు.. VIDEO
Hardik Pandya | ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని (Somnath Temple) సందర్శించాడు. సంప్రదాయ దుస్తుల్లో అతడు మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు.
Hardik Pandya | ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2024 (IPL-2024)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు వరుస పరాజయాల పాలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. గత సీజన్లలో మంచి ఆటతీరుతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ ఈ సారి ఘోరంగా విఫలమవుతుండటంతో అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. ఇక ముంబై జట్టు తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు జట్టుకు లాంగ్ బ్రేక్ దొరికింది. దీంతో జట్టు సభ్యులంతా కాస్త చిల్ అవుతున్నారు. ఒత్తిడికి గురవ్వకుండా తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే ముంబై జట్టు మొత్తం గుజరాత్ టూర్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అక్కడ ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని (Somnath Temple) సందర్శించాడు. సంప్రదాయ దుస్తుల్లో అతడు మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ దేవాలయానికి దేశం నలుమూలల నుంచి రోజూ వేల సంఖ్యలో భక్తులు మహాదేవుడి సందర్శనార్థం వస్తుంటారు.
హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో తడబాటుకు లోనవుతున్న విషయం తెలిసిందే. గుజరాత్ టీం కెప్టెన్‌గా అద్భుత విజయాలు అందుకున్న పాండ్యా ముంబై ఇండియన్స్ విషయంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకూ ఆడిన అన్ని మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. జట్టు విజయం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#WATCH | Gujarat: Indian Cricket Team all-rounder Hardik Pandya offers prayers at Somnath Temple.
Source: Somnath Temple Trust pic.twitter.com/F8n05Q1LSA
— ANI (@ANI) April 5, 2024
Also Read..
Rishi Sunak | ఇంగ్లండ్ జట్టుతో కలిసి క్రికెట్ ఆడిన రిషి సునాక్.. VIDEO
Sriram Balaji | యూఎస్ మెన్స్ క్లే కోర్టు చాంపియన్‌షిప్.. సెమీస్‌లో బాలాజీ, బిజెమన్
NGT | ఐపీఎల్ మ్యాచ్‌లకు నీళ్లెక్కడివి ?.. కేఎస్‌సీఏ నుంచి నివేదిక కోరిన ఎన్జీటీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

