KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వాంగ్మూలం ఇచ్చేందుకు ఈ నెల 18న హాజరు కావాలని నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సినీ నటులు నాగచైతన్య, సమంతల విడాకుల విషయంలో కేటీఆర్‌పై కొండాసురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ మంత్రిపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై సోమవారం విచారణ జరిపిన కోర్టు కేటీఆర్‌తో పాటు నలుగురు కీలక సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను వాంగ్మూలం ఇచ్చేందుకు 18న రావాలని ఆదేశించింది.