KTR | బీఆర్ఎస్ సోషల్‌మీడియా యాక్టివిస్ట్ దుర్గం శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు విషయంలో పోలీసుల తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎవరూ అధికారంలో శాశ్వతంగా ఉండరని.. తమకూ ఒక రోజు వస్తుందని తెలంగాణ డీజీపీ జితేందర్‌ను ఆయన హెచ్చరించారు. కొణతం దిలీప్ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ఈ మేరకు కేటీఆర్ స్పందించారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, భయానక పరిస్థితులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, తమకు కూడా ఒక రోజు వస్తుందని తెలంగాణ డీజీపీ జితేందర్‌ను ఉద్దేశించి అన్నారు. అప్పుడు ప్రతి చర్యను సమీక్షిస్తామని ఈ మేరకు తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ ట్వీట్(ఎక్స్) చేశారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. దీనిపై పోరాడుతూనే ఉంటామని తెలిపారు.
Dear @TelanganaDGP Garu
Telangana people are observing all the excesses of the administration and the terrible precedents being set
Please remember no one is going to remain in Govt forever. Our day shall come again and I promise you, every action will be reviewed
We have… https://t.co/67Ke3tynrE
— KTR (@KTRBRS) July 17, 2025
తెలంగాణ డీజీపీ జితేందర్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్‌పై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉన్న మీరు కేవలం మీ రాజకీయ బాసుల ఆదేశాల మేరకు అమాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి, అరెస్టులు చేసి, జైళ్లకు పంపుతున్నారని పేర్కొంది. మీరు వేసుకున్న ఖాకీ బట్టలకు కాస్త విలువ ఇవ్వండని సూచించింది. మీరు ఆల్ ఇండియా సర్వీసులో ఉన్నారని గుర్తుచేసింది.
భారత రాష్ట్ర సమితి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ మీద పోస్టు చేసిన ట్వీట్లను రీట్వీట్ చేశాడని మీరు శశిధర్ గౌడ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటి తలుపులు బద్ధలు కొట్టి ఎత్తుకుపోయి, 17 రోజులుగా జైళ్ళో పెట్టారు. ఇవ్వాళ ఉదయం పాత కేసుల్లో బెయిల్ వచ్చి విడుదల అయ్యే సమయానికి మరొక అక్రమ కేసు పెట్టి రామగుండం పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారని మండిపడింది. ఈ మేరకు శశిధర్ గౌడ్ రిట్వీట్ చేసిన ఫొటోను ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేస్తూ.. అందులో ఏం అసభ్యత, చట్టవిరుద్ధమైన అంశం కనిపించిందని నిలదీసింది. ఈ పోస్టు మీద ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా స్వయంగా సైబర్ క్రైం కానిస్టేబుల్ ఫిర్యాదు చేసి, దానిపై ఎఫ్ఐఆర్ చేయడం దుర్మార్గమని మండిపడింది. సైనిక నియంతల పాలనలో కూడా ఇటువంటి పోస్టులకు కేసులు పెట్టరని పేర్కొంది. రాజకీయ విమర్శకు, వ్యంగ్య చిత్రాలకు కూడా కేసులు నమోదు చేస్తే ఈ దేశంలో ఎవరూ బయట మిగలరని చెప్పింది. మీ చర్యలు భావప్రకటన స్వేచ్చను హరిస్తున్నాయని మీకు అర్థమవుతోందా అని ప్రశ్నించింది. ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యలు వెంటనే మానుకోవాలని హితవు పలికింది. మీ కక్షసాధింపు చర్యలను దేశవ్యాప్తంగా ఎండగడుతామని.. మీ పొలిటికల్ బాసుల తప్పులకు రేపు బలయ్యేది మీరే అని హెచ్చరించింది. ఈ అక్రమ కేసుల మీద న్యాయస్థానాల్లో పోరాడుతామని స్పష్టం చేసింది.