KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ జీవితం ఒక చరిత్రగా నిలిచిపోతుంది అని కొనియాడారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయలేని అనేక కార్యక్రమాలను కేసీఆర్ విజయవంతంగా సాధించారు. ప్రజాస్వామ్య పోరాటంతో, తెలంగాణ ఆర్తితో తెలంగాణ కోసం, కేవలం తెలంగాణ కోసమే కేసీఆర్ పనిచేశారు. ఉద్యమం ద్వారా కోట్లాది మందికి స్వరాష్ట్ర ఆశయాన్ని అందించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని కేటీఆర్ పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం కరువుకు, దాహానికి శాశ్వత పరిష్కారం చూపించారు. కేసీఆర్ బలం, జీవన దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి జోకర్ కాంగ్రెస్ నాయకులకు జీవితకాలం కూడా చాలదు. అల్ప మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ నాయకులు 100 జన్మలు ఎత్తినా కూడా కేసీఆర్ సాధించిన విజయాల్లో పదవంతైనా సాధించలేరు అని కేటీఆర్ పేర్కొన్నారు.
His story is History
He did a miracle that wasn’t possible for 60years!
He ran a democratic campaign with nothing but pure passion for Telangana
He agitated for a separate state, a dream of millions of people
He quenched the thirst of Telangana with Kaleshwaram
One… pic.twitter.com/2hHbYDWJcZ
— KTR (@KTRBRS) June 11, 2025