KTR | కాంగ్రెస్ సర్కార్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నపూర్ణ వంటి నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా అని ఆవేదన వ్యక్తం చేశారు. 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన నా తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డలు ఆర్తనాదాలు చేస్తున్నారని అన్నారు.
దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలి కేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపామని గుర్తు చేవారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నమో రామచంద్రా అని ఆకలి కేకలు వినిపించే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకుని ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించి విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. కానీ ఇప్పుడు అదే విద్యార్థులు గుప్పెడన్నెం కోసం నేడు గుండెలవిసేలా రోదిస్తున్నారు.. సిగ్గు సిగ్గు అని విమర్శించారు. ఇది పాలకుల పాపం కానీ.. విద్యార్థులకు శాపంగా మారిందని చెప్పారు. జాగో తెలంగాణ జాగో అని ప్రజలకు పిలుపునిచ్చారు.
అన్నపూర్ణ నా తెలంగాణలో
బువ్వకోసం బిడ్డల ఏడ్పులా !కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన నా తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా !
దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలికేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో దేశానికే… pic.twitter.com/N6BFgIkK3H
— KTR (@KTRBRS) December 31, 2024
మోసం, విధ్వంసం, అల్లర్లు.. 2024లో కాంగ్రెస్ పాలనకు 3డీ సారాంశమని కేటీఆర్ అన్నారు. వాళ్లు ఎంతగా దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించినప్పటికీ.. 2025లో దృఢంగా ఉండి.. తెలంగాణ ప్రజలకు వారిచ్చిన 420 హామీలపై వారిని జవాబుదారీలుగా నిలబెడతామని స్పష్టం చేశారు.