KTR | ఖమ్మం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గుంపు మేస్త్రీ నోట్లో నుంచి కంపు తప్ప ఏమీ రాదు అని రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం జిల్లాలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని యువతకు విజ్ఞప్తి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. పొరపాటున అలవాటు చేసుకోవద్దు. జీవితాలు నాశనం అవుతాయి. జీవితంలో సిగరెట్ తాగని వ్యక్తిని నేను. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరుతున్నా. రేవంత్ రెడ్డి స్పీచ్‌లకు, వార్తలకు చిట్‌చాట్‌లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి. డ్రగ్స్ ప్రాణాలు ఎలా హరిస్తాయో కొన్ని నికృష్టపు మాటలు, డైలాగులు మీ ఆరోగ్యానికి కూడా హానీకరం. కొంతమంది పెద్దలు చెబుతంటారు. నక్క పీనుగనే పీక్కతింటది. పంది బురదలోనే పొర్లాడుతుంది. పెండ పురుగు గొడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రీ నోట్లో నుంచి కంపు తప్ప ఏమీ రాదు. నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని తేలిపోయింది అని కేటీఆర్ విమర్శించారు.
ఒక రోజు డ్రగ్స్ అంటాడు. ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ అంటాడు. కాదంటే కాళేశ్వరం లేదంటే కేసీఆర్ అంటాడు. 20 నెలల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం, డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్ లైన్, డెడ్‌లైన్ మేనేజ్మెంట్ తప్ప ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి ఏం చేశారు అని అడుగుతున్నా. అందుకే పెద్దలు చెబుతారు పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావొచ్చు.. ఇంకో మూడేండ్లు ఉండొచ్చు.. మురిపెంగా డబ్బుల మూటలు దోచుకుంటుండొచ్చు కానీ ఎన్నటికీ నీ బతుకు పెండ పురుగు బతుకే తప్ప.. ఎన్నటికీ కేసీఆర్ స్థాయి గానీ, సీఎంకు ఉండే గౌరవం కాని రాదు అని స్పష్టం చేశారు.
విజయ్ భాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, రోశయ్య, కేసీఆర్ సీఎంలు అయ్యాక ఆ పదవికి హుందాతనం తీసుకువచ్చారు. వీరంతా హుందాగా వ్యవహరించారు. మీరు నికృష్టంగా వ్యవహరిస్తున్నారు. మీపాలనను దేశం మొత్తం గమనిస్తుంది. రెండేండ్లు అవుతుంది సీఎం అయి. వీసమెత్తు లాభం పొందిన మనిషిని, వర్గాన్ని చూపిస్తావా..? కానీ నీవల్ల లాభపండింది.. మాత్రం చిల్లర గాసిప్ వెబ్సైట్లు, యూట్యూబ్ చానెల్స్, చిల్లర థంబ్ నెయిల్స్ పెట్టే కొంతమందికి కడుపునిండా ఆదాయం వస్తున్నమాట వాస్తవం. మీడియా ముసగులో దరిద్రాన్ని వండే దగ్బులాజీలకు ఆదాయం వచ్చింది. రాష్ట్ర ప్రజలకు దమ్మిడి లాభం నీ వల్ల లేదు. ఇష్టమొచ్చినట్లు చిట్ చాట్ల పేరిట మాట్లాడుతూ చీటింగ్ చేస్తున్నావు. టన్నుల కొద్ది కేసులు పెట్టాడు.. కానీ గుండు పిన్నంతా ఆధారం దొరకలేదు. చేతిలో పవర్ ఉంది.. నువ్వే సీఎం, హోం మంత్రి, వేల మంది పోలీసులు ఉన్నారు. ఏం తప్పు చూపించావు.. ఏం పీకినావ్.. లీకులు తప్ప నీవు పీకింది ఏంది..? మేం ఏం తప్పు చేయలేదు. అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నాం. దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడిని. ఓటుకు నోటు కేసులో డబ్బులు ఇవ్వలేదు తీసుకోలేదు అని చెప్పే ద్మము నీకు ఉందా..? నీవు మగాడివి అయితే వస్తావా.. ప్రజల ముందు కూర్చుందాం.. తేల్చుకుందాం. సవాల్ చేస్తే రాకుండా పారిపోయిన పిరికి పందవు నువ్వు అని సీఎంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి. సీఎం అయ్యాక కూడా నీ బుద్ది మరాలేదు. చిట్ చాట్ల పేరిట చీకటి బాగోతం ఎందుకు..ముక్కుసూటిగా మాట్లాడుకుందాం రా.. పారిపోయిన పిరికి సన్నాసివి నీవు. చిట్ చాట్ల పేరిట డ్రామాలు ఆడుతున్నావు. చర్చ ఎక్కడా పెట్టిన వస్తా. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చర్చ పెట్టు. నీకు రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం తెలియదు. పనికిమాలన డైలగులు వస్తాయి.. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు రమ్మంటావా.. నీ కొడంగల్ కోటకు రమ్మంటావా.. నీలాగా పారిపోయే పిరికి పందను కాదు. చర్చకు రెడీగా ఉన్నాం. మేం పోరాట నుంచి వచ్చాం నీలాగా బ్యాగులు మోసి రాలేదు అని రేవంత్ పై కేటీఆర్ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా.. మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఎప్పుడు బట్టలు చింపుకుని రోడ్ల మీద పరుగెడుతాడో తెలియదు. మేం కంగారు పడుతున్నాం. డాక్టర్లకు చూపించండి. వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. పిచ్చోడు అయిపోయి రోడ్ల మీద తిరిగేలా ఉన్నాడు. ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడక ముందే హాస్పిటల్‌కు చూపించాలని కోరుతున్నా అని కేటీఆర్ సూచించారు.