KTR | హైదరాబాద్ : దేశానికి అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మరింత దారుణ స్థితికి చేరుకుంది. సరిపడా కరెంట్ లేక, సాగునీరు ఇవ్వక, సమయానికి ఎరువులు, విత్తనాలు అందించకపోవడంతో.. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. చివరకు యూరియా సరఫరాలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఒక్క రైతుకు ఒక్క యూరియా బస్తానే ఇస్తుండడంతో.. అది కూడా కొందరికే దక్కుతుండడంతో.. రైతులు వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఎలాగైనా యూరియా బస్తాను దక్కించుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది రైతులు అర్ధరాత్రి సమయంలో వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్దకు చేరుకుని అక్కడే నిద్రిస్తున్నారు. అలాంటి ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని సింగిల్ విండో ఎరువుల దుకాణం వద్ద కనిపించింది. ఎరువుల దుకాణం తెరవకముందే వచ్చి, లైన్లో ఆధార్ కార్డులు, పాస్ బుక్కులు పెట్టి అక్కడే ఓ మహిళా రైతు నిద్రించింది.
ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాము అని చెప్పి మరీ
నిజం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. 2014కి ముందు రైతులు అర్ధరాత్రి బాయికాడ కరెంటు కోసం పండుకునే దుస్థితి. 2025లో యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణం అరుగు మీద పండుకునే దుస్థితి ఏర్పడింది. వారెవ్వా ఎంత గొప్ప మార్పు ఇది అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాము అని చెప్పి మరీ
నిజం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం2014కి ముందు రైతులు అర్ధరాత్రి బాయికాడ కరెంటు కోసం పండుకునే దుస్థితి
2025లో యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణం అరుగు మీద పండుకునే దుస్థితి
వారెవ్వా ఎంత గొప్ప మార్పు ఇది 👏👏… pic.twitter.com/fSHcuHOQk7
— KTR (@KTRBRS) August 16, 2025