హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రమంతా యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ గంటల తరబడి యూరియా కోసం క్యూలైన్లలో నిల్చుంటున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పీఏసీఎస్ వద్ద ఓ వృద్ధ రైతు చెప్పుల వరుస చివర్లో నేలపై పడుకొని ఉన్న చిత్రంపై కేటీఆర్ స్పందించారు.
రేవంత్.. నీ దరిద్రిపుగొట్టు పాలనకు దక్కిన అసమర్థ ఆస్కార్ అవార్డు ఇది అని కేటీఆర్ విమర్శించారు. ఈ ఫోటోను ఫ్రేమ్ కట్టించుకుంటావో.. మెడలో వేసుకుని ఊరేగుతావో నీ ఇష్టం అని మండిపడ్డారు. అన్నదాతను “అప్పులపాలు” చేసిన చేతకాని పాలకులను చూశాం కానీ.. “చెప్పులపాలు” చేసిన చెత్త రికార్డు మాత్రం నీదే అని రేవంత్‌పై నిప్పులు చెరిగారు.
బస్తా యూరియా కోసం.. రైతు బతుకును బజారున పడేశావు.. అందరి కడుపునింపే అన్నదాతను.. పాదరక్షల పాల్జేసిన నీ పాపం ఊరికే పోదు అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చివరకు కేటీఆర్ జై కిసాన్.. జై తెలంగాణ.. అని నినదించారు.
రేవంత్..
నీ దరిద్రిపుగొట్టు పాలనకు దక్కిన
అసమర్థ ఆస్కార్ అవార్డు ఇది…ఈ ఫోటోను ఫ్రేమ్ కట్టించుకుంటావో..
మెడలో వేసుకుని ఊరేగుతావో నీ ఇష్టం..అన్నదాతను “అప్పులపాలు” చేసిన..
చేతకాని పాలకులను చూశాం కానీ..
“చెప్పులపాలు” చేసిన చెత్త రికార్డు మాత్రం నీదే..బస్తా యూరియా కోసం..… pic.twitter.com/24hJUQShSr
— KTR (@KTRBRS) August 21, 2025