KTR | హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయదశమి అని కేటీఆర్ పేర్కొన్నారు.
దసరా అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక పండగ. తమ సొంత ఊళ్ళల్లో, సొంత ప్రదేశాలలో ఇంటిల్లిపాదులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప వేడుక దసరా. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కలుసుకొని తమ కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ సంబురం దసరా. ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు… ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరాలని ఆ జగన్మాతను ప్రార్ధిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయ దశమి.
దసరా అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక పండగ. తమ సొంత ఊళ్ళల్లో, సొంత ప్రదేశాలలో ఇంటిల్లిపాదులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప వేడుక దసరా. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కలుసుకొని తమ కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ సంబురం దసరా.… pic.twitter.com/o0k5tk9OW6
— KTR (@KTRBRS) October 2, 2025