LVPEI | హైదరాబాద్ : హైదరాబాద్‌లో 37 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి(LVPEI) ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో ఎప్పుడూ అగ్రభాగాన నిలుస్తోంది. ఎన్నో రకాల కంటి సమస్యలకు మెరుగైన వైద్య చికిత్స అందించడంలో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి కీర్తి గడించింది. ఇక 50 వేల కార్నియల్ ట్రాన్స్ప్లాంట్లు పూర్తి చేసి ప్రపంచంలోనే మొదటి ఇన్స్టిట్యూట్గా ఎల్వీ ప్రసాద్ చరిత్ర సృష్టించింది.
ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వర్ రావు, ఆయన బృందానికి కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
హైదరాబాద్‌లో 1987లో తమ మొదటి కంటి ఆస్పత్రిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎల్వీ ప్రసాద్ సంస్థ ప్రధానంగా సమానత్వం,సమర్థత,శ్రేష్ఠత అనే విలువలను అనుసరిస్తుంది. ఇక్కడ పేద, ధనిక అన్న తేడా లేకుండా రోగులందరినీ సమానంగా చూస్తారు. సమర్థత విషయానికొస్తే… అత్యుత్తమ వైద్య పరికరాలు, అధునాతన టెక్నాలజీతో కూడిన ఉత్తమ వైద్య సేవలు ఇక్కడ అందుతాయి.
Many congratulations to @lvprasadeye on becoming the first Institute in the world to have performed 50,000 corneal transplants
Kudos to the amazing Founder Chair Dr. Gullapalli Nageshwar Rao Garu and his brilliant team pic.twitter.com/YkfRfP42U8
— KTR (@KTRBRS) September 9, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టును స్వాగతిస్తున్నాం : హరీశ్‌రావు
Telangana | తెలుగు నుడికి గుడి కట్టిన తెలంగాణ