KTR | హైదరాబాద్ : తెలంగాణలోని ఆడపడుచులందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక, మన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని కేటీఆర్ కొనియాడారు. తీరొక్క పూలను అందంగా పేర్చి, ఆటపాటలతో పూలనే పూజించే అపురూప వేడుక మన బతుకమ్మ పండగ అని పేర్కొన్నారు. నేటి నుండి మొదలయ్యే బతుకమ్మ వేడుకలను ఆడబిడ్డలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుతూ… తెలంగాణ ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.