KTR | హైదరాబాద్ : హైదరాబాద్ ఫార్మాసిటీ భూములను కాంగ్రెస్ పార్టీ నేతల దోపిడి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవగానే ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి, భూములను రైతన్నలకు తిరిగి ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి, తమ కాంగ్రెస్ లీడర్లతో కలిసి ఫార్మాసిటీ భూములను కొట్టేస్తున్నారు. ఫార్మాసిటీ భూములపై కాంగ్రెస్ నేతలు గద్దల మాదిరి వాలి దోచుకుంటున్నారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతన్నలకు నష్టపరిహారంగా కేటాయించిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ నేతలు తమ పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రైతన్నలకు దక్కాల్సిన ఇండ్ల స్థలాలను అతి తక్కువ రేట్లకు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రైతన్నలకు నష్టపరిహారంగా దక్కాల్సిన దానిని కాంగ్రెస్ నేతలు ఎందుకు దోచుకుంటున్నారు? రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతన్నలను కూడా వదలకుండా, దోపిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరు సిగ్గుచేటు అని కేటీఆర్ మండిపడ్డారు.
Mr. Revanth Reddy, you had announced that “Hyderabad Green Pharma City” project would be cancelled and lands would be returned to the farmers if Congress was voted to power
Not only have you failed in delivering on your promise, Now, your CONgress leaders have descended like… https://t.co/oAGEsrEazu
— KTR (@KTRBRS) July 2, 2025