KTR | బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంత్ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. క్రిశాంక్ అంటే ఒక ఉద్యమ గొంతుక.. ఒక చైతన్య ప్రతీక, యువతరానికి ప్రతిబింబమన్నారు. గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై.. ఢిల్లీ బీజేపీ అరాచకాలపై.. గళమెత్తినందుకే ఈ దౌర్జన్యం.. ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గమంటూ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు.. మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ నియంతృత్వ.. నిర్బంధాలకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. నాడు ఎమర్జెన్సీ చూశామని.. నేడు అప్రకటిత ఎమర్జెన్సీ చూస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసినందుకు.. ఆనాడు పాలక పక్షానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్, బీజేపీలకు పట్టడం ఖాయమన్నారు.
ఇదిలా ఉండగా.. మన్నె క్రిశాంక్‌ను పోలీసులు ఇవాళ పంతంగి టోల్ వద్ద అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కారణం తెలపకుండా మన్నె క్రిశాంక్‌ను పోలీసులు తీసుకున్నారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్‌ను మార్గమధ్యంలో అడ్డుకొని అకారణంగా మన్నె క్రిశాంక్ కారులో కూర్చొని తీసుకెళ్లారు. అయితే, ఇప్పటి వరకు క్రిశాంక్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయం పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు.
అదుపులోకి తీసుకున్న గంటల తర్వాత కూడా ఎక్కడికి తీసుకెళ్లారో ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబీకులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి క్రిశాంక్ అరెస్టుపై ఈస్ట్‌జోన్ డీసీపీ గిరిధర్ స్పందించారు. క్రిశాంక్‌ను అరెస్టు చేశామని, కొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరుచనున్నట్లు తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం సికింద్రాబాద్ జడ్జి ఇంట్లో మన్నె క్రిశాంక్‌ను హాజరు పరచనున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు నెలల్లోనే ఆరు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నది. తాజాగా అరెస్టులకు దిగడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
క్రిషాంక్ అరెస్టు..
అక్రమం.. అన్యాయం.. దుర్మార్గం.. @Krishank_BRS అంటే..
ఒక ఉద్యమ గొంతుక
ఒక చైతన్య ప్రతీక
యువతరానికి ప్రతిబింబంగల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై..
ఢిల్లీ బీజేపీ అరాచకాలపై..
గళమెత్తినందుకే ఈ దౌర్జన్యం..
ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గం..కాంగ్రెస్- బీజేపీ కలిసి… pic.twitter.com/k1g9Ou4WVp
— KTR (@KTRBRS) May 1, 2024