KTR | హైదరాబాద్ : కేసీఆర్ హయాంలో ఏనాడూ కూడా రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కలేదు. ధర్నా చేయలేదు. కానీ కాంగ్రెస్ పాలనలో మాత్రం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క యూరియా బస్తా కోసం వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు అన్నదాతలు. ఈ పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. కేసీఆర్ పాలనను గుర్తు చేశారు.
ఇది కదా నాయకత్వం అంటే.. ఇది కదా ముందు చూపు అంటే అని కేటీఆర్ పేర్కొంటూ.. కేసీఆర్ హయాంలో రైతులకు జరిగిన మేలును వివరించారు. నాడు సీఎం కేసీఆర్ సారథ్యంలో.. యూరియాను టైంకు తెప్పించడానికి ముందస్తుగా ఎన్నో ప్రణాళికలు చేసేవారు. అడుగడుగునా కసరత్తులు నిర్వహించి తెప్పించారు.
వ్యవసాయ అధికారులతో కేసీఆర్ వరుస సమీక్షలు నిర్వహించేవారు. కేంద్రానికి సీజన్‌కు ముందే లెక్కలతో సహా వినతులు ఇచ్చేవారు. ఏపీలోని నౌకాశ్రయాలకు మన ఆఫీసర్లను పంపి ఆదేశాలు ఇప్పించేవారు. దక్షిణమధ్య రైల్వే అధికారులకు స్వయంగా కేసీఆర్ ఫోన్లు చేసేవారు. 25 స్పెషల్ గూడ్స్ రైళ్ల ఏర్పాటుకు ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేసేవారు. పక్కరాష్ట్రం రవాణా శాఖ మంత్రితో నేరుగా సంప్రదింపులు, ఏకంగా 4 వేల లారీలను రంగంలోకి దించేలా సన్నాహాలు చేసేవారు. పోర్టుల నుంచి నేరుగా మండలాలకు తరలించే వ్యూహాలు, ప్రతి రైతుకు సమయానికి యూరియా అందేలా చర్యలు తీసుకున్నారు. నేరుగా గ్రామాల్లోనే సరఫరా చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు, తెలంగాణలో ఏ ప్రాంతంలోనూ కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇది కదా వ్యవస్థను నడిపించే విధానం.. ఇది కదా రైతును రాజును చేసే సంకల్పం అని కేటీఆర్ స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాలు తప్ప.. పరిపాలన తెలియని అసమర్ధులు.. రాజ్యమేలడం వల్లే రైతులకు ఈ కష్టాలు.. కన్నీళ్లు మిగిలాయన్నారు. ఓవైపు బూతులు తప్ప చేతలు రాని ఢిల్లీ పార్టీల నాయకులకు.. మరోవైపు “వందేళ్ల విజన్‌కు నిలువెత్తు రూపమైన కేసీఆర్‌కు..” ఉన్న స్పష్టమైన తేడా ఇది అని నాలుగుకోట్ల తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది..!! రైతును అరిగోస పెడుతున్న వాళ్ల పతనం ప్రారంభమైంది..!! అని కేటీఆర్ పేర్కొన్నారు. జై కిసాన్.. జై కేసీఆర్ అని కేటీఆర్ నినదించారు.
ఇది కదా నాయకత్వం అంటే
ఇది కదా ముందు చూపు అంటే..!!నాడు సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో..
యూరియాను టైంకు తెప్పించడానికి..
ముందస్తుగా ఎన్నెన్ని ప్రణాళికలు..
అడుగడుగునా ఎన్నిరకాల కసరత్తులు..✳️ వ్యవసాయ అధికారులతో కేసీఆర్ గారి వరుస సమీక్షలు
✳️ కేంద్రానికి సీజన్ కు ముందే లెక్కలతో సహా… pic.twitter.com/Yq0yfx1X59— KTR (@KTRBRS) August 22, 2025