KTR | ఆమన్‌గల్ : పదేండ్ల పాటు కేసీఆర్ హయాంలో రైతు ఒక రాజులాగా బ్రహ్మాండంగా బతికాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆమన్‌గల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ పదిహేను నెలల కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎవరికీ న్యాయం చేయలేదు. రైతు రుణమాపీ, రైతుబంధు, తులం బంగారం, మహిళలకు రూ. 2500 రాలేదు. 420 హామీలిచ్చి దొంగమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. రాష్ట్రమంతా పక్కన పెడితే.. సొంత నియోజకరవ్గరం, సొంత తాలుకాలో కూడా ఒక్కపని చేయలేదు. సొంతూరికి, అత్తగారి ఊరికి ఏం చేసిండో అడుగదామని వచ్చానని కేటీఆర్ తెలిపారు.
రూ. 2 లక్షల రుణమాఫీ చాలా మందికి కాలేదు. రైతుబంధు కూడా రాలేదు. టకీటకీమని పైసలు పడలేదు. గత 6 నెలల నుంచి అన్ని జిల్లాల్లో తిరుగుతున్నాం. గత పదేండ్లలో మోటార్లు కాలేదు.. ట్రాన్స్ఫార్మర్లు పేలలేదు. అప్పుడు అప్పు అడిగే పరిస్థితి లేదు. నాట్లు వేసే నాటికి రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకుని టకీ టకీమని పడుతాయ్ అన్నాడు. టకీ లేదు టుక్ లేదు అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
రైతుబంధు కేసీఆర్ బిచ్చమేసినట్లు రూ. 10 వేలు ఇస్తుండు.. నేను రూ. 15 వేలు వేస్తా అన్నాడు. కనీసం 10 శాతం మందికి కూడా రైతుబంధు ఇవ్వలేదు. ఒకేసారి రుణమాఫీ చేస్తా అని అన్నాడు. చారణా కూడా రుణమాఫీ చేయలేదు. 10 శాతం మందికి కూడా బోనస్ పడలేదు అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | మీలాగా బ్లాక్మెయిల్ దందా చేస్తారనుకోవడం తప్పు.. రేవంత్‌కు కేటీఆర్ చురకలు
Car Stunts: ఔటర్ రింగు రోడ్డుపై కార్లతో స్టంట్.. ఇద్దరు విద్యార్థులు అరెస్టు
Budget 2025 | బడ్జెట్ కూర్పుపై సర్కారు మల్లగుల్లాలు.. నేటికీ ప్రాధాన్యతా పథకాలను తేల్చని ప్రభుత్వం