KTR | హైదరాబాద్ : ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిర్వచనం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కేటీఆర్ నివాళులర్పించారు.
స్వాతంత్య్ర ఉద్యమం నుండి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు.. పలు ప్రజా పోరాటాల్లో పాల్గొన్న ధీర చరిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీది అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసంలోనే పురుడు పోసుకుంది.. మలిదశ ఉద్యమానికి వారు అందించిన సేవలు ఎనలేనివి అని గుర్తు చేశారు.
రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది, వారి పేరు హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టుకుని వారిని గౌరవించింది అని కేటీఆర్ తెలిపారు.