KTR | హైదరాబాద్ : మాదాపూర్ సీసీఎస్ స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ చదువు యాదయ్యను భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీఎంజీ) అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే. విధి నిర్వహణలో విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించి.. రాష్ట్రపతి శౌర్య పతకాన్ని సాధించిన తెలంగాణ బిడ్డ కానిస్టేబుల్ యాదయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు.
ఏడు కత్తి పొట్లు పడి.. రక్తం ధారలా కారుతున్నా చైన్ స్నాచింగ్ నిందితులను పట్టుకునేందుకు యాదయ్య చూపించిన తెగువ అసామాన్యం అని కేటీఆర్ కొనియాడారు. 2022లో జరిగిన ఈ ఘటనలో యాదయ్య చేసిన సాహసానికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవం దక్కడం సంతోషకరమన్నారు. సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణ పోలీసులు శక్తివంచన లేకుండా ఎలా పని చేశారో తెలపడానికి ఈ ఉదంతం ఒక గొప్ప ఉదాహరణ. తన వృత్తి పట్ల, ప్రజల బాగోగుల పట్ల యాదయ్య చూపించిన చిత్తశుద్ధి.. ప్రతి ఉద్యోగికి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిదాయకం.. శభాష్ యాదయ్య అంటూ కేటీఆర్ ప్రశంసించారు.
విధి నిర్వహణలో విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించి.. రాష్ట్రపతి శౌర్య పతకాన్ని సాధించిన తెలంగాణ బిడ్డ కానిస్టేబుల్ యాదయ్య గారికి అభినందనలు.
ఏడు కత్తి పొట్లు పడి.. రక్తం ధారలా కారుతున్నా చైన్ స్నాచింగ్ నిందితులను పట్టుకునేందుకు యాదయ్య చూపించిన తెగువ అసామాన్యం. 2022లో జరిగిన ఈ ఘటనలో… pic.twitter.com/yUviSmSKuX
— KTR (@KTRBRS) August 16, 2024
ఇవి కూడా చదవండి..
KTR | అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు : కేటీఆర్
RRR | గడువులోగా సాధ్యమయ్యేనా?.. ట్రిపుల్ఆర్ భవితవ్యంపై సర్వత్రా అనుమానాలు