KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్ భవన్‌కు వెళ్లేందుకు నంది నగర్‌లోని తన నివాసం నుంచి బయల్దేరారు. సికింద్రాబాద్‌లోని రేతి ఫైల్ బస్ స్టేషన్ నుంచి పార్టీ సీనియర్ నేతలతో కలిసి కేటీఆర్ ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని బస్ భవన్‌కు బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ వెంట పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవ్వాళ “చలో బస్ భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చినం అని పేర్కొన్నారు. మహిళలకు ఉచితం అని, పురుషులకు టికెట్ల రేట్లు డబుల్ చేస్తే.. బస్ పాస్ ధరలు పెంచితే కుటుంబం మీద భారం పడదా? అని రేవంత్ సర్కార్‌ను నిలదీశారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ‘చలో బస్‌భవన్’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను (KTR) పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం తెల్లవారుజామునే నంది నగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. తనతోపాటు బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందు భారీగా పోలీసుల మోహరింపుపై, ప్రభుత్వం పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవ్వాళ “చలో బస్ భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చినం
మహిళలకు ఉచితం అని
పురుషులకు టికెట్ల రేట్లు డబుల్ చేస్తే..
బస్ పాస్ ధరలు పెంచితే కుటుంబం మీద భారం పడదా?పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని… pic.twitter.com/SPcfWGMspW
— BRS Party (@BRSparty) October 9, 2025