KTR | హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషిస్తే నాలుక చీరేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనట అని రేవంత్ పనితీరును ఉద్దేశించి కేటీఆర్ విమర్శించారు. ఇదే బీద అరుపులు అరుస్తున్నాడు సీఎం. ఇంకో దిక్కు తెలంగాణ రైజింగ్, ఫ్యూచర్ సిటీ.. లక్షన్నర కోట్లు మూసీ.. 420 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ అమలు చేసేందుకు పైసల్లేవ్ అని అంటున్నరు. కచ్చితంగా ప్రజల తరపున అడుగుతాం.. వదిలిపెట్టం. పరిపానల చేతగాకపోతే తప్పుకో.. రాజీనామా పెట్టు నాతో అయితలేదు అని.. ఢిల్లీకి మూటలు పంపుడు.. ఇక్కడ మేనేజ్ చేసుడు నాతోటి అయితలేదు అని, చేతులేత్తేస్తున్నా.. ఐపీ డిక్లేర్ చేస్తున్న అని వెళ్లిపో. అంతేకానీ తెలంగాణను తిడుతా అంటే ఇన్నాళ్లు ఉపేక్షించాం.. ఇక నుంచి ఊరుకోం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
చివరిసారి చెబుతున్నాం.. కేసీఆర్ను ఇప్పటిదాకా ఎన్ని మాటలు అన్న పడ్డాం. ఇక నుంచి కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నాలుక చీరేస్తాం.. ఆ రోజు కూడా వస్తది.. తప్పకుండా యాది పెట్టుకో. ఎవ్వడు వందల సంవత్సరాల కోసం పుట్టలేదు.. ఎవ్వడు వేల సంవత్సరాలు ఉండడు. పక్కా చెబుతున్నాం ముమ్మాటికీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే. నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన తెలంగాణను మళ్లా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆరే. అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో.. రాష్ట్రాన్ని నిందించడం, దూషించడం మానుకోవాలని చెబుతున్నాను అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.