KTR | హైదరాబాద్ : మేధావిలా డైలాగులు కొట్టుడు కాదు.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధం కావాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మాజీ జడ్పిటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో లంబాడ సోదరుల భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. కానీ స్థానిక రైతులు అధికారులకు నిరసన తెలిపి అక్కడ్నుంచి పంపించేశారు. ఇక రేవంత్ రెడ్డికి అహం దెబ్బతిని 40 మందిని జైల్లో పెట్టించిండు. అందులో దళిత, గిరిజన రైతులు ఉన్నారు. వారందరిని పరిగి, సంగారెడ్డి, చర్లపల్లి జైలుకు పంపించారు. ఆ రైతుల తరపున అన్ని కమిషన్లను కలిసి సీఎం రేవంత్ ప్రవర్తనతో పాటు కాంగ్రెస్ పాలకుల గురించి వివరించాం. మొత్తానికి న్యాయపోరాటం చేసి రైతులను జైళ్ల నుంచి విడిపించామని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇక ఇటీవలే నేను లగచర్ల పోయాను. 30 వేల మందికి పైగా తరలివచ్చారు. రేవంత్ రెడ్డిని తరిమికొడుతాం అని హెచ్చరించారు. సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే రేవంత్ రెడ్డికే దిక్కు లేదు.. మీ కడియం శ్రీహరి ఉంటాడా అని అడుగుతున్నాను. తెల్లారిలేస్తే నీతులు మాట్లాడుతడు.. ప్రపంచంలో నా కంటే మేధావి ఎవరు లేరన్నట్టు ప్రవర్తిస్తుండు.. ఆ లెవల్లో ఫోజులు కొడుతుండు కడియం శ్రీహరి. మరి నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్దమనిషి.. ఏమన్న ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రా. దమ్ముంటే రా.. భీకరమైన డైలాగులు ఎందుకు.. నిజంగా నీవు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉందనుకుంటే రాజీనామా పెట్టు.. ఉప ఎన్నికకు రా. సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం.. న్యాయం జరుగుతది.. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. బరాబర్ కొట్లాడాలి.. వీళ్ల సంగతేంటో తేల్చాలి అని కేటీఆర్ అన్నారు.
మోసపోయామని ప్రజలకు కూడా అర్థమైంది.. ప్రజలకు కూడా తెలియాలి.. గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తది.. రేవంత్ రెడ్డిని చూసిన తర్వాతనే కేసీఆర్ విలువ తెలుస్తుంది. ప్రజలకు కూడా తెలిసిరావాలి. రుణమాఫీ లేదు, రైతుబంధు, కల్యాణలక్ష్మి లేదు. తెలంగాణ రైతులకు టకీటకీమని డబ్బులు పడడం లేదు కానీ.. టకీటకీమని ఢిల్లీలో మాత్రం మోగుతుంది.. ఎందుకంటే పదవిని కాపాడుకోవాలి కాబట్టి. బిల్డర్లు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వద్ద దోచుకుని ఢిల్లీలో అప్పజెప్పుతుండు అని కేటీఆర్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
KTR | సీఎం రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Harish Rao | ఎండాకాలం రాకముందే హైదరాబాద్‌లో నీటి ఎద్దడి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్