KTR | సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా?.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కార్ పరిపాలనను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. యాకుత్‌పురాలో మ్యాన్‌హోల్‌లో చిన్నారి పడిపోయిన ఘటనపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కార్ పరిపాలనను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. యాకుత్‌పురాలో మ్యాన్‌హోల్‌లో చిన్నారి పడిపోయిన ఘటనపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
అసలు రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నారా..? సర్కస్ నడుపుతున్నారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. లేదంటే ఆమె కుటుంబానికి పుట్టెడు శోకం కలిగి ఉండేదన్నారు.
అయితే చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే.. తప్పు మాది కాదు జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంది. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసింది! అని కేటీఆర్ తెలిపారు.
మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే, ఆయన శాఖలోని విభాగాలేమో
సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్కార్ నడుపుతున్నరా?
సర్కస్ నడుపుతున్నరా?ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల
నగరంలో నిన్న ఒక చిన్నారి
తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయింది.
అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి.చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని
మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు… pic.twitter.com/y4AgJyiXir— KTR (@KTRBRS) September 12, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- GHMC
- Hyderabad
- Hydraa
- jalamandali
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

