KTR | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులు బస్తా యూరియా కోసం తండ్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడికి వెళ్లారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశ్నించారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే వాటిని సరిదిద్దాల్సిన పాలకులు ఢిల్లీ పర్యటనలు, బీహార్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతుల కష్టాలపై దృష్టి పెట్టకుండా రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి జాతీయ రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై మండిపడ్డారు. ఈ విషయమై మంగళవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. ‘రైతుబిడ్డలు ఇకడ.. రాష్ట్ర సీఎం, మంత్రులు ఎకడ?’ అని ఆయన ప్రశ్నించారు. ‘సమస్యలు ఇకడ ఉంటే, సీఎం, మంత్రులు ఢిల్లీ, బీహార్ లోనా?’ అని నిలదీశారు. యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు. ‘రైతులు యూరియా కోసం తండ్లాడుతుంటే, మీరు ఎకడ ఎన్నికలు ఉంటే అకడికి ఎగిరిపోతారా?’ అని ఘాటుగా విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విఫలం
జాతీయ పార్టీల తీరుపైనా కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘జాతీయ పార్టీలకు ఓట్లు, రాష్ట్ర ప్రజలకు పాట్లు’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. యూరియా సమస్యను పరిషరించడంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని విమర్శించారు. ‘యూరియా ఏదయ్యా.. అంటే కాంగ్రెస్ ఎంపీలు తేలేరు, బీజేపీ ఎంపీలు అడగనే అడగరు’ అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, జాతీయ పార్టీల నిర్లక్ష్య తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రైతుల సమస్యలను వెంటనే పరిషరించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. సద్దులు కట్టుకొని యారియా కోసం వచ్చిన మహిళా రైతులు, పాస్‌పుస్తకాలు లైన్లలో పెట్టిన రైతులు, యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులకు సంబంధించిన ఫొటోలను ఈ సందర్భంగా కేటీఆర్ పోస్టు చేశారు.