KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే నీకు ఎందుకింత భయం నీకు అని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో పరిగి నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఇంకా గమ్మత్తు ఏంటేంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి కేసీఆర్‌ను తిడుతుండు. రేవంత్ రెడ్డికి ఏదో సమస్య ఉన్నది. కేసీఆర్ పేరు తీసుకోకుండా ఆయన ఉపన్యాసం ఉండదు. 20 నెలలుగా కేసీఆర్ తన పని తాను చేసుకుంటున్నాడు. ఢిల్లీ అయినా, అసెంబ్లీ అయినా, ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ పేరు కలువరిస్తుండు. నిద్రలో కూడా కలువరిస్తుండు అని నా డౌట్. రేవంత్‌కు ఎంత ఫోబియా పట్టుకుందంటే.. కేసీఆర్ అంటే ఎందుకింత భయం నీకు అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
420 అడ్డమైన హామీలిచ్చి అబద్దాలు చెప్పి అడ్డదారిలో ముఖ్యమంత్రి అయ్యావు. పని చేయ్.. ఆరు గ్యారెంటీలు అమలు చేయ్. ఎందుకీ డ్రామాలు. బీసీలను మోసం చేస్తున్నావు అంటే నన్ను కూడా తిడుతుండు. ఎవరిది డ్రామా.. రాహుల్ గాంధీతో నీ దోస్తీ ఒక పెద్ద డ్రామా. మోదీతో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా. చంద్రబాబు చేస్తున్న జలదోపిడీ విషయంలో నీవు పైటింగ్ చేస్తున్నట్టు చేసుడు ఇంకా పెద్ద డ్రామా. నీ మేనిఫెస్టో కూడా ఒక పెద్ద డ్రామా. నీ డిక్లరేషన్లు దాని కంటే పెద్ద డ్రామా. అన్నింటికి మించి నీవు కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని నమ్మించడమే పెద్ద డ్రామా. ఈ మనిషిని ఎట్ట నమ్ముతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎప్పటికప్పుడు మాటలు మారుస్తడు. మోదీ స్కూల్లో చదివాను.. చంద్రబాబు కాలేజీకి పోయాను.. ఇప్పుడు రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నా. అంటే రేపు ఎటన్న పోతా అని చెప్తున్నట్టే కదా.. ఒక సిద్ధాంతం, ఒక నిబద్ధత లేదు ఆయనకు. రేవంత్ డ్రామాలన్నీ ప్రజలందరికీ అర్థమవుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.